హిట్టా లేక ఫట్టా: మిస్టర్ మజ్ను – అఖిల్ ఈ సారి..?

Friday, January 25th, 2019, 04:10:41 PM IST

తన కెరీర్ మొదలు పెట్టిన ఆదిలోనే ఏ హీరో డెబ్యూ మూవీకి రానంత హైప్ అక్కినేని వారసుడు అఖిల్ సంపాదించుకున్నాడు అంటే అందులో ఎలాంటి అతిశెయోక్తి లేదు.అలాగే తన మొదటి సినిమాకి ఎంత హైప్ తెచ్చుకున్నాడో ఆ సినిమా కూడా అంతే ఘోరమైన ప్లాప్ ను నమోదు చేసుకున్నాడు.ఆ తర్వాత కూడా విలక్షణ దర్శకుడు విక్రమ్ కే కుమార్ తో తీసిన ”హలో” వినేమకు కమర్షియల్ గా మంచి టాక్ వచ్చినా సినిమా ఓవర్ బిజినెస్ కావడంతో లాభాల బాట పట్టక అది కూడా ప్లాప్ జాబితాలోకి చేరిపోయింది.దానితో ఎట్టి పరిస్థితుల్లోనూ అఖిల్ కు హిట్ దొరకాల్సిన సమయంలో అప్పటికే వరుణ్ తేజ్ తో “తొలిప్రేమ” లాంటి డీసెంట్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న వెంకీ అట్లూరి అఖిల్ తో “మిస్టర్ మజ్ను” సినిమా మొదలు పెట్టారు.ఇప్పుడు ఈ సినిమా ఈ రోజే విడుదలయ్యింది.తాను తీసిన రెండు సినిమాలా ప్లాపుల నుంచి వెంకీ అఖిల్ బ్రేక్ ఇచ్చారా..? ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపించబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం రండి.

అక్కినేని ఫ్యామిలీ అంటేనే అందానికి, రొమాన్స్ కి పెట్టింది పేరు.కానీ వీరి నుంచి సరైన డాన్సర్ మాత్రం లేని వెలితి ఉండేది,దాన్ని అఖిల్ తన మొదటి సినిమాతోనే తీర్చేసారు.దానితో అక్కినేని అభిమానుల ఆనందానికి హద్దుల్లేవు.అందుకు తగ్గట్టు గానే అఖిల్ కూడా తన ప్రతీ సినిమాకి తనని తాను మలుచుకుంటున్నారు.ఇక ఈ సినిమా విషయానికి వచ్చినట్టయితే అఖిల్ లుక్స్ పరంగా ముందు సినిమాలతో పోలిస్తే కాస్త బెటర్ లుక్ లోనే కనిపించారు.అలాగే నటనలో కూడా ముందు సినిమాలతో చూసుకున్నట్టయితే మంచి పరిణితి కూడా గమనించొచ్చు ముఖ్యంగా ఈ సినిమాలోని హీరో హీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని భావోద్వేగపూరిత సన్నివేశాల్లో అఖిల్ చక్కని నటన కనబర్చారు.అలాగే ఈ సినిమా టైటిల్ సాంగ్ లో అఖిల్ 8 ప్యాక్ బాడీ తో కనిపించే సీన్స్ అక్కినేని ఫాన్స్ కి కన్నుల పండుగలా కనిపిస్తాయి.

ఒక పక్క రొమాంటిక్ షేడ్స్ కలిగిన యువకునిలా మరో పక్క ఒక ప్రేమికునిలా రెండు కనిపించే రెండు పాత్రల్లో అఖిల్ నటనా తీరుని మెచ్చుకోవచ్చు.అలాగే అఖిల్ తో పాటు హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేకూర్చింది.దర్శకుడు వెంకీ అట్లూరి తన మొదటి సినిమాలో ఛాన్స్ ఇచ్చిన జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆదికి ఈ సినిమాలో కూడా ఒక మంచి కామెడీ రోల్ ఇచ్చారు.ఇక సంగీత దర్శకుడు థమన్ విషయానికి వచ్చినట్టయితే గడిచిన లాస్ట్ ఐదు ఆల్బమ్స్ ని చూస్కుంటే థమన్ మాత్రం ఎక్కడా తగ్గకుండా కొత్త ట్యూన్స్ అందించడానికి పడుతున్న తపన కనిపిస్తుంది.అది “మిస్టర్ మజ్ను” సినిమాతో మరో సారి నిరూపితమయ్యింది.నటీనటుల పరంగా ఎవరు ఎంత చేయగలరో అంతటిని ఈ సినిమా కోసం దర్శకుడు రాబట్టడంలో సక్సెస్ అయ్యారు.

కానీ కథనం విషయంలో దర్శకుని పని తీరు మాత్రం పెద్ద చెప్పుకోదగ్గ స్థాయిలో అయితే లేదనే చెప్పాలి.సినిమా మొదలయిన దగ్గర నుంచి ఇంటర్వెల్ వరకు పర్వాలేదనిపించే స్థాయిలో అక్కడక్కడా చిన్న చిన్న లాగ్స్ సినిమాని బాగానే నెట్టుకొస్తాడు.కాకపోతే కథలో ఏ మాత్రం కొత్తదనం లేకపోవడం,కథను నడిపించే తీరు సినిమా చూసే ప్రేక్షకునికి అంత కన్వినెన్స్ గా అనిపించదు.దానికి తోడు తొలిప్రేమ లాంటి భిన్నమైన సినిమా తర్వాత ఆ రేంజ్ లో ఊహించుకొని వెళ్లే ఆడియెన్స్ కి మాత్రం కాస్త నిరాశే మిగులుతుందని చెప్పాలి.పేలవంగా సాగే ఫస్టాఫ్ తర్వాత అయినా సినిమా కాస్త ఆసక్తికరంగా సాగుతుందా అంటే కాస్త బెటర్ గా అనిపించినా అది కూడా అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంజాయ్ చేసేంత రీతిలో అయితే ఉండదు.ఈ విషయంలో మాత్రం దర్శకుడు ఖచ్చితంగా ఎక్కువ శ్రద్ధ వహించి ఉంటే సినిమా ఫలితం వేరే స్థాయిలో ఉండేది.

ఇక మొత్తానికి చూసుకున్నట్టయితే హిట్ కోసం పరితపిస్తున్న అఖిల్ కు ఈ సారి కూడా చేదు పరాభవమే ఎదురయ్యేలా ఉందని చెప్పాలి.దర్శకుని యొక్క తనంలో లోపం,పెద్దగా ఆసక్తికరంగా సాగని ప్రేమకథ క్లాస్ ఆడియెన్స్ ని కొంత వరకు మెప్పించినా అన్ని వర్గాల వారికి నచ్చడం కాస్త కష్టమనే చెప్పాలి.మొత్తానికి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలవొచ్చు.

123telugu.com రేటింగ్ : 2.75/5 – అక్కడక్కడే బాగుంది !

tupaki.com రేటింగ్ : 2.5/5 – మిస్టర్ మజ్ను.. డోస్ సరిపోలేదు!

gulte.com రేటింగ్ : 3.25/5 ‍– అఖిల్ కొట్టేసాడు..

indiaglitz.com రేటింగ్ : 2.5/5 – పర్వాలేదనిపించే మిస్టర్ మజ్నుPoll : What did you think of ‘Mr.Majnu’ (‘మిస్టర్ మజ్ను’ సినిమాపై మీ అభిప్రాయం ఏమిటి)?