హిట్టా ఫ‌ట్టా : ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు.. జ‌య‌హో ఎన్టీఆర్

Wednesday, January 9th, 2019, 05:43:30 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా బయో పిక్ ల పరంపర ఇప్పుడిప్పుడే మొదలయ్యింది.ఇప్పటికే సావిత్రి యొక్క జీవిత చరిత్ర పై “మహానటి” అనే ఒక సినిమా వచ్చి ప్రేక్షకులను అలరించింది.ఇప్పుడు అదే బాటలో తెలుగు సినీ పరిశ్రమతో పాటు ప్రతీ ఒక్క తెలుగు వాని ఖ్యాతిని ఎల్లలు దాటించిన ధృవ తార స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు.

ఇప్పుడు ఆయన యొక్క జీవిత చరిత్ర పై క్రిష్ జాగర్ల మూడి దర్శకత్వంలో రామారావు గారి తనయుడు నందమూరి బాలకృష్ణే హీరోగా తెరకెక్కించిన చిత్రం యన్.టి.ఆర్. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమా మొదటి భాగం యన్.టి.ఆర్ – కథానాయకుడు ఈ రోజే సంక్రాంతి కానుకగా విడుదలయ్యింది.రెండోసారి క్రిష్ మరియు బాలయ్య కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా అందులోను,రామారావు గారి జీవిత చరిత్ర కావడంతో భారీ అంచనాలతోనే ఈ చిత్రం విడుదలయ్యింది.మరి బాక్సాఫీస్ దగ్గర ఈ కాంబినేషన్ ఎంత వరకు విజయం సాధించిందో ఇప్పుడు చూద్దాం.

ఈ చిత్ర దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోని తెరకెక్కించారు.ప్రతీ ఒక్క పాత్రకి సంబంధించి ఎక్కడా రాజీ పడకుండా ఉన్నత ప్రమాణాలతో అగ్ర నటులనే పెట్టి ఈ సినిమాను తెరకెక్కించారు.ఈ సినిమా మొదలవ్వడమే బాలీవుడ్ నటి విద్యా బాలన్(బసవతారకం) ఆమె యొక్క భర్త రామారావు(బాలకృష్ణ) గారి జీవిత గాథని తన కొడుకు హరికృష్ణ(కళ్యాణ్ రామ్) కు చెప్పడంతోనే మొదలవుతుంది.నందమూరి తారక రామారావు గారి పాత్రలో బాలకృష్ణ అలా పరకాయ ప్రవేశం చేసేసారు.తనదైన శైలి అద్భుత నటనతో బాలకృష్ణ మెప్పిస్తారు.అలాగే సందర్భానుసారం వచ్చే డైలాగులతో సాయి మాధవ్ బుర్రా మంచి డైలాగులే అందించారు కానీ ఇది వరకు సినిమాల స్థాయిలో అయితే ఈ సినిమాకు అందించలేకపోయారు.

దానికి తోడు క్రిష్ కథానుసారం పాత్రలు పరిచయం చేయడానికే ఎక్కువ సమయం తీసుకున్నట్టు కూడా అక్కడక్కడా అనిపిస్తుంది.కొన్ని కొన్ని సీన్లలో అయితే బాలకృష్ణ నటన అమోఘమే అని చెప్పాలి.ముఖ్యంగా ఫస్టాఫ్ లో వచ్చే మాయాబజార్ లో కృష్ణుని పాత్ర మరియు రావణాసురుని పాత్ర ఫస్టాఫ్ అంతటికి ప్రధాన ఆకర్షణగా చెప్పొచ్చు అలాగే అక్కినేని నాగేశ్వర్ రావు పాత్రలో సుమంత్ కనబరిచిన నటన రామారావు మరియు ఎన్నార్ ల మధ్య వచ్చే సన్నివేశాలు కూడా ఈ చిత్రానికి బాగా ప్లస్ అయ్యాయి.

ఇక ఇతర పాత్రల్లో నటించిన హీరోయిన్లు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు.సినిమాలోని ఎమోషన్ సన్నివేశాలు కూడా కాస్త ఎక్కువ కావడంతో ఎక్కడో ట్రాక్ తప్పుతున్న భావన అయితే ప్రేక్షకునికి కలుగుతుంది.ఈ చిత్రాన్ని మరింత ఆసక్తిగా తెరకెక్కించడంలో దర్శకుడు క్రిష్ ఇంకాస్త ఎక్కువ జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది.సెకండాఫ్ లో వచ్చే రానా యొక్క పాత్ర క్లైమాక్స్ లో తన రాజకీయ పార్టీ ప్రస్థానాన్ని చూపించే కొన్ని సీన్లు మినహా అంతా కథ నెమ్మదిగా సాగదీతగా అనిపిస్తుంది.

ఓవరాల్ గా ఫస్ట్ పార్ట్ లో సెకండ్ పార్ట్ కి మంచి లీడ్ ఇచ్చాడు క్రిష్. సో సెకండ్ పార్ట్ కోసం నందమూరి అభిమానులు మాత్రమే కాదు ప్రతి తెలుగు ప్రేక్షకుడు ఆశగా ఎదురుచూస్తాడు. అలా వెయిట్ చేసేలా చేశాడు క్రిష్.ఎన్టీఆర్ చరిత్ర లోకం ఎరిగిన‌ది. తెలిసిన వాళ్ళకు పరమాన్నం లాంటి సినిమా ఎన్టీఆర్ కథానాయకుడు. తెలియనివారికి మాత్రం విందు భోజనం లాంటిది. అయితే ప్రతి నాణానికి రెండోవైపు ఉంటుంది. క్రిష్ ఆ రెండో వైపును చూపించాలనుకోలేదు, నందమూరి అభిమానులు కూడా ఆ మరోవైపును చూడడానికి ఇష్టపడరనుకోండి. అందువల్ల.. ఒక చక్కని సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ కోసం ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాన్ని కుటుంబ సమేతంగా థియేటర్లో చూడండి.

123telugu.com Rating : 3.25/5 – ఎన్టీఆర్ గా బాలయ్య నట విశ్వరూపం

timesofindia.com  Rating : 3/5 –  ఇది క‌థ కాదు ఎన్టీఆర్ జీవితం

gulte.com  Rating : 3.5/5  – ది రైస్ ఆఫ్ ఇండియన్ సినిమా ఫ‌స్ట్ సూపర్ స్టార్

thehansindia.com Rating : 3/5 – వెండితెర పై ఎన్టీఆర్ స‌క్సెస్‌ఫుల్ జ‌ర్నీ

tupaki.com Rating : 3/5 –  మలుపుల్లేవు కానీ మెప్పిస్తుందిWhat did you think of ‘NTR Kathanayakudu'( ‘ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు’ సినిమాపై మీ అభిప్రాయం ఏమిటి)?