ట్రాలీ ఆటోలో 40 కోట్లు..

Friday, May 11th, 2018, 10:35:45 AM IST

నల్లగొండ జిల్లాలో ఎవరు ఊహించని విధంగా ఓ ఘటన చోటుచేసుకుంది. బ్యాంకు అథికారులు చేసిన పనికి ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు.ల ఒక ట్రాలీ ఆటో నిండా కరెన్సీ నోట్లను తీసుకెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. స్థానిక స్టేట్‌ బ్యాంక్‌ అధికారులు కనీస సెక్యూరిటీ లేకుండా ఓపెన్‌ ట్రాలీ ఆటోలో రూ.40 కోట్లను తరలించారు. కనీసం డబ్బు కనిపించకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. దీంతో స్థానిక ప్రజలు ఆటో గురించి మాట్లాడుకోవడం సంచలనంగా మారింది.

ఎస్‌బీఐ ప్రధాన శాఖ నుంచి ట్రాలీలో రూ.40 కోట్లను జిల్లా కేంద్రంలోని గ్రామీణ వికాస్‌ బ్యాంకుకు తరలించారు. సెక్యూరిటీ లేకుండా వెళ్లడంతో ఓ వ్యక్తి ద్వారా సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు బ్యాంక్ మేనేజర్ ని కలిశారు. సెక్యూరిటీ వ్యాన్ లేకుంటే పోలీసుల సహాయమైన తీసుకోవాల్సింది. కనీస జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలా అని చర్చించగా సెక్యూరిటీ గార్డుల ద్వారానే డబ్బును తరలించడానికి ఏర్పాటు చేసినట్లు బ్యాంకు అధికారులు తెలియజేశారు. ఇక ఆటోలో కనిపించిన డబ్బును చూసి జనాలు సెల్ఫీలు ఫోటోలు తీసుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.