బ్రేకింగ్ న్యూస్ : భార్య బండారం బట్టబయలు చేసిన భర్త

Friday, April 6th, 2018, 02:02:14 AM IST

సమాజంలో భార్యా భర్తల గొడవలు గొడవలు సాధారణంగా హత్యలకో, ఆత్మహత్యలకో లేక పిచ్చి పట్టి పారిపోవతానికో దారి తీయడం చూసాం. కానీ ఇక్కడ ఒక భారీ ఉదంతం చోటు చేసుకుంది. భార్య, భర్త మధ్య తలెత్తిన వివాదంఏకంగా ఒక వ్యభ్చార వ్యాపారం నడపదానికే దారి తీసింది. ఈ వివాదం దుబాయ్‌లో వ్యభిచార వృత్తి నిర్వహిస్తున్న వారి గుట్టురట్టు చేసింది. పిడుగురాళ్ల సీఐ హనుమంతురావు తెలిపిన వివరాల ప్రకారం.. పిడుగురాళ్లకు చెందిన మస్తాన్‌వలి, ఆషాభి (రెబ్బమ్మ) భార్యభర్తలు. కొంతకాలంగా వీరిమధ్య తీవ్ర విభేదాలు తలెత్తడంతో విడిపోయి ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. ఈక్రమంలోనే మస్తాన్‌వలి తన భార్య అమ్మాయిలకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి వారి నుంచి నగదు వసూలు చేసి దుబాయ్‌ పంపి.. అక్కడ ఉన్న ఆమె చెల్లెలు ఆషికీ ద్వారా వ్యభిచారం చేసేలా అమ్మాయిలపై ఒత్తిడి తెస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దీంతో సీఐ బుధవారం రెబ్బమ్మను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి విచారణ చేపట్టగా అనేక విషయాలు చీకటి కోణం నుండి వెలికి తీసారు.

రెబ్బమ్మ చెల్లెలు ఆషికీ కొన్నేళ్లుగా దుబాయిలో నివసిస్తుంది. ఈమె రాజమండ్రికి చెందిన నందు అనే వ్యక్తితో అక్కడ సహజీవనం చేస్తూ ఆడపిల్లలను మోసం చేస్తూ వారిచే బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. రెబ్బమ్మ పిడుగురాళ్లకు చెందిన కొందరు అమ్మాయిలకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి వారి నుంచి నగదు వసూలు చేసి దుబాయ్‌ పంపింది. అక్కడ ఉన్న ఆమె చెల్లెలు వారితో బలవంతంగా వ్యభిచారం చేయిస్తూ ఎంతోకొంత డబ్బులు ఇస్తుండేది. ఈ క్రమంలోనే అక్కడకు వెళ్లిన వారిలో కొందరు వ్యభిచారం చేయడం ఇష్టం లేక తిరిగి పిడుగురాళ్లకు తప్పించుకు వచ్చారు. అలా తిరిగి వచ్చిన వారిని సీఐ స్టేషన్‌కు పిలిచి విచారించారు. అందులో ఓ అమ్మాయి జూన్‌ నెలలో వెళ్లగా జనవరిలో తిరిగి వచ్చింది. 7 నెలలు తనతో వ్యభిచారం చేయించి నెలకు రూ.25 వేలు ఇస్తానని నగదు ఇవ్వక పోవడంతో అక్కడ పోలీసులను సంప్రదించి వారి సాయంతో పిడుగురాళ్ల వచ్చానని సీఐకి తెలిపింది. దీంతో ఆయన కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దుబాయ్‌ నుంచి తిరిగివచ్చిన పలువురు మహిళల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. మళ్లీ కొత్తగా మరో పదిమందిని అక్కడికి పంపేందుకు వీసాలు రెబ్బమ్మ సిద్ధం చేసినట్లు గమనించామని, ఈ కేసులో ఇంకా అనేక మందిని విచారించాల్సి ఉందని సీఐ తెలిపారు. ఇప్పటివరకు ఎంత మందిని వ్యభిచార వృత్తిపై ఇలా దుబాయ్ కి పంపింద అన్న విషయం కూడా ఇంకా పోలీసులకు పక్కా తెలియకపోగా కావాల్సిన వివరాలన్నీ సేకరించి రెబ్బమ్మకు తగిన శిక్ష పడేలా చూస్తామని పోలీసులు తెలిపారు.