జయరాం కేసులో షాకింగ్ నిజాన్ని బయటపెట్టిన పోలీసులు.!

Sunday, February 3rd, 2019, 04:05:50 PM IST

గత నాలుగు రోజులు క్రితం హైదరాబాద్ కి చెందిన ఎన్నారై ప్రముఖ వ్యాపారవేత్త మరియు కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ జయరాం హత్యకు గురైన విషయం ఎంతటి సంచలనంగా మారిందో అందరికీ తెలిసిందే.అయితే ఈ కేసుకి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న మిస్టరీకి పోలీసులు తెర దించేశారు.ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎవరో పోలీసులు కనిపెట్టి అరెస్ట్ చేసారు.

ఈ హత్యా కేసులో ముందు నుంచి అనుమానం ఉన్నటువంటి రాకేష్ రెడ్డే ఈ హత్యకు పాల్పడ్డాడని పోలీసులు తేల్చేసారు.జయరాం దగ్గర రాకేష్ తీసుకున్నటువంటి 4 కోట్ల అప్పే దీనికి కారణమని పోలీసులు అంటున్నారు.దీనికోసం రాకేష్ మరో ఏడుగురు సహాయం తీసుకున్నాడని,ఇప్పుడు వారిని పట్టుకునే పనిలో తామున్నామని స్పష్టం చేసారు.అంతే కాకుండా రాకేష్ ఈ హత్యను ఒక ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలా చిత్రీకరించాలని ప్రయత్నించాడని,పోలీసులు తెలియజేసారు.