జగన్ వారి కోరిక తీరుస్తాడట.. అది సాధ్యమయ్యేపనేనా..?

Thursday, April 7th, 2016, 10:09:08 AM IST


ఆంధ్రప్రదేశ్ లో వైకాపా నుంచి ఒక్కొక్కరిగా పార్టీ మారుతున్నారు. పార్టీలో ముఖ్యనేతలు ఇప్పటికే పార్టీ మారారు. మారుతూనే ఉన్నారు. వైకాపాలో కీలకవ్యక్తిగా ఉన్న జ్యోతుల నెహ్రు ఈనెల 11 వ తేదీన తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఇలా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్దమవుతున్న తరుణంలో వైఎస్ జగన్ తనను కలిసేందుకు కడప వచ్చిన మహిళా నేతలతో చర్చలు జరిపారు. ప్రస్తుతం రాజకీయాలలో వస్తున్న మార్పుల గురించి వారితో ముచ్చతించారు. ఇక ప్రభుత్వ వైఫల్యాలపై కూడా ఆయన చర్చించినట్టు సమాచారం.

ఇక మహిళా నేతలు కొంతమంది జగన్ ను సిఎం గా చూడాలని అనుకుంటున్నామని అన్నారట. దానికి జగన్ ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందని చెప్పారట. ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేఖత మొదలైందని.. వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి భంగపాటు తప్పదని.. ఏవిధంగా చూసుకున్నా వచ్చేసారి తాను సిఎం అవుతానని మహిళలతో చెప్పారట. మరి జగన్ కోరిక తీరుతుందా లేదా అన్నది తెలియాలి అంటే వచ్చే ఎన్నికల వరకు ఆగాల్సిందే.