రాజకీయాలకు నేను దూరం : కమల్ హాసన్

Friday, November 7th, 2014, 11:20:57 PM IST


విశ్వనటుడు కమల్ హాసన్ రాజకీయాలలోకి వస్తారని ఎప్పటినుంచో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే.. ఈ విషయాలపై.. కమల్ హాసన్ ఈ రోజు స్పష్టత ఇచ్చారు. తనకు రాజకీయాలలోకి వచ్చే ఉద్దేశ్యం లేదని.. కమల్ తేల్చి చెప్పారు. రాజకీయాలలోకి వచ్చి.. ఎమ్మెల్యేనో.. ఎంపినో కావాలని అనుకోని ఉంటె.. ఎప్పుడో అయ్యేవాడినని కమల్ అన్నారు. అయితే.. తాను ఒక నటుడిగా ప్రజాసేవ చేస్తానని.. దానికి రాజకీయాలతో సంబంధంలేదని అన్నారు. నాలుగేళ్ల వయసులోనే కమల్ సినిరంగ ప్రవేశం చేసి.. ఎన్నో అవార్డులు రివార్డులు సొంతం చేసుకున్నారు. ఒడిదుడుకులు ఎదురైనా సమయంలో కూడా కమల్ ఎదురొడ్డి పోరాడి సినిమారంగంలో తనకంటు ఒక ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు కమల్ హాసన్. విశ్వనటుడు కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఆయన రాజకీయరంగ ప్రవేశంపై పైవిధంగా స్పందించారు.