మోడీ ఆ ఒక్కమాట అంటే .. పవన్, జగన్ లు సైలెంట్ అవుతారా..?

Wednesday, May 18th, 2016, 08:28:21 AM IST


ప్రధాని మోడీ అంటే పవన్ కళ్యాణ్ కు మంచి గౌరవం ఉన్నది. గత ఎన్నికలలో మోడీ కోసమే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి అటు బీజేపికి సపోర్ట్ చేశారు. ఇక, మోడీ పిలుపుమేరకు ఆయన పార్లమెంట్ భవన్ మిత్రపక్షాల భేటికి కూడా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ కు అన్ని రకాలుగా ఆదుకుంటామని గతంలో చెప్పడంతో పవన్ తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేశారు. అయితే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీ ప్రత్యేక హోదా ఇవ్వమని కేంద్రం చెప్పడంతోను, తెలుగుదేశం పార్టీ బీజేపిపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక హోదా సాధించుకోవడానికి కృషి చేయలేకపోవడంతోను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి పోరాటం చేసేందుకు సిద్దమవుతున్నారు.

ఇక ఇప్పటికే వైకాపా అధినేత జగన్ జలదీక్ష పేరుతో ఉద్యమం ప్రారంభించారు. ప్రత్యేక హోదా విషయంలో కూడా జగన్ పోరాటం చేసేందుకు పావులు కదుపుతున్నారు. అలాగే, కేంద్రానికి ఎలాగైనా దగ్గర కావాలని జగన్ చూస్తున్నారు. ఈ పరిణామాల మధ్య చంద్రబాబు ఢిల్లీలో మోడీని కలిశారు. కరువుపై వివరించారు.రాష్ట్రంలోని తాజా పరిణామాల గురించి మోడీతో వివరించారు. మోడీ వీటిపై ఏ మేరకు హామీ ఇచ్చారు అన్నది ప్రస్తుతానికి గోప్యమే. వీటి సంగతి పక్కన పెడితే, ప్రత్యేక హోదాపై మోడీ కనుక ఇప్పుడు హామీ ఇస్తే.. ఉద్యమం చేస్తున్న వైఎస్ జగన్, పోరాటానికి సిద్దమవుతున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ లు సైలెంట్ అవుతారు. మోడీ హామీ ఇవ్వరని మనకు అర్ధమవుతున్న తరుణంలో వీరి పోరాటం ఎంతవరకు విజయవంతం అవుతుంది అన్నది తెలియాలి.