అఖిల్ సినిమాలో ‘స్పెషల్’ గెస్ట్!

Sunday, May 10th, 2015, 09:10:57 PM IST


టాలీవుడ్ మన్మధుడు నాగార్జున తనయుడు, అక్కినేని వారసుడు అఖిల్ తొలిసారి తెరంగేట్రం చేస్తున్న సినిమాలో ప్రముఖ కధానాయిక ఇలియానా స్పెషల్ ఎట్రాక్షన్ గా కనిపించబోతున్నట్లు తెలుగు సినీ పరిశ్రమ వర్గాల ద్వారా సమాచారం తెలుస్తోంది. ఈ మేరకు వీవీ వినాయక్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో ఇలియానా ఐటెం సాంగ్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. కాగా టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా చెలామణి అయిన ఇలియానా ‘బర్ఫీ’ చిత్రం ద్వారా బాలీవుడ్ లో ప్రవేశించి అక్కడ బిజీ అయిన సంగతి తెలిసిందే.

అయితే ఇటీవల మరలా టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇద్దామని ప్రయత్నిస్తున్న ఇలియానాకు అఖిల్ సినిమాలో అవకాశం రావడంతో వెంటనే అంగీకరించిందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ఇదే సమాచారం గనుక నిజమైతే త్వరలో ఇలియానా స్పెషల్ ఎట్రాక్షన్ గా తెలుగు ప్రేక్షకులకు కనువిందు చేయబోతున్నట్లే లెక్క.