‘ఆట’ మారలేదు..!

Tuesday, January 20th, 2015, 12:24:13 PM IST


ఆసీస్ గ‌డ్డపై తొలి విజ‌యం కోసం ఎదురుచూస్తున్న టీమిండియాకు నిరాశే మిగిలేటట్టుంది. తొలి వ‌న్డేలో ఆసీస్ చేతిలో భంగ‌ప‌డ్డ టీమిండియా ఆట‌.. ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న వ‌న్డేలోనూ మార‌లేదు. ఈ సారి బ్యాట్స్‌మెన్ ఘోరంగా ఫేలయ్యారు. మ‌క్కోణ‌పు వ‌న్డే సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో భార‌త్ ఫేలమైన బ్యాటింగ్ తో కేవలం 153 పరుగులకే కుప్పకూలింది. విరాట్‌కోహ్లీ(4), రైనా(1), అంబటి రాయుడు(23), భువనేశ్వర్ కుమార్(5), ధోని(34), స్టువర్టు బిన్నీ(44) రహానే(33) పరుగులు చేసి ఔటయ్యారు. ఇంగ్లాండ్ విజయలక్ష్యం 154పరుగులు.