మాల్దీవులకు భారత్ మంచినీటి సాయం

Friday, December 5th, 2014, 05:36:34 PM IST


మాల్దీవులలో తీవ్రమైన మంచినీటి కొరత ఏర్పడింది. దీంతో ప్రజలు అనేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. దేశం చుట్టూ సముద్రం ఉన్నప్పటికీ.. తాగేందుకు పనికిరాదన్న విషయం తెలిసిందే. ఇక మాల్దీవులలో ఉప్పునీటిని శుద్ది చేసి మంచినీరుగా మార్చి వాడుకుంటారు. అయితే… ఈ మంచినీటి శుద్ధి కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం సంభవించడంతో.. ఆ దేశం మంచినీటి కొరతను ఎదుర్కొంటున్నది.

తమకు మంచినీటి సాయం అందించాలని.. భారత్, శ్రీలంక మరియు చైనా దేశాలను కోరింది. మాల్దీవుల సమస్యను అర్ధం చేసుకున్న ఇండియా… మానవతా దృక్పదంతో స్పందించి… సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. భారత్ మంచినీటిని ఐఎల్ 76 అనే ప్రత్యేక విమానంలో ఆ దేశానికి పంపించింది. మాల్దీవుల రాజధాని మాలేలో మంచినీటి ఎద్దడి మూలంగా దాదాపు లక్షమంది ప్రజలు ఇబ్బందుకు ఎదుర్కొంటున్నారు.

ఇక సార్క్ సదస్సులో పెద్దన్న పాత్రపోషించిన ఇండియా.. సాయం చేయడంలోనూ తాము ముందు ఉంటామని నిరూపించింది. పక్కదేశాలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా సాయం చేయడంలో భారత్ ముందు ఉంటుంది.