టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

Sunday, February 15th, 2015, 09:45:13 AM IST


ఇండియా పాకిస్తాన్ ల మధ్య క్రికెట్ యుద్ధం అడిలైడ్ సాక్షిగా మొదలైంది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే.. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఆడే అభిమానులకు అందరికీ ఒక పండగే అని చెప్పవచ్చు. అందులోను వరల్డ్ కప్ అంటే మరీ క్రేజ్. వరల్డ్ కప్ లో ఇండియా పాకిస్తాన్ జట్లు ఒకే పూల్ లో ఆడుతున్న విషయం తెలిసిందే.

అడిలైడ్ లోని ఓవల్ మైదానంలో ఇండియా పాక్ మ్యాచ్ ప్రారంభం అయింది. ఇక ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది. ఇక రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ లు ఓపెనర్లు గా బ్యాటింగ్ ప్రారంభించారు.