ప్రపంచవ్యాప్తంగా భారతీయ ఉద్యోగులే బెస్ట్!

Monday, December 1st, 2014, 02:27:49 PM IST


ఉద్యోగుల ఎంపిక విధానాలను రూపకల్పన చేసే బీఐ సంస్థ ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన అధ్యయనంలో భారతీయ ఉద్యోగులు అనేక రంగాల్లో కీలకంగా ఉంటూ మంచి పనితీరును కనబరుస్తున్నట్లు వెల్లడైంది. అలాగే వివిధ దేశాలలో పనిచేస్తున్న భారతీయ ఉద్యోగులలో 51% మంది ఉత్తమ ఫలితాలను సాధించడంతో పాటు అంతర్జాతీయంగా పేరు గడించారని బీఐ సంస్థ తన అధ్యయనంలో తేల్చి చెప్పింది.

కాగా ప్రపంచవ్యాప్తంగా 51% ఉత్తమ ఉద్యోగులతో భారత్ మొదటి స్థానంలో ఉండగా, 49%తో చైనా ద్వితీయ స్థానంలో, 38%తో అమెరికా ఉద్యోగులు నిలిచారని ఈ సంస్థ పేర్కొంది. ఇక క్రమశిక్షణ, ప్రతిభ, అంకితభావం మొదలగు అంశాలను పరిగణలోకి తీసుకుని పలు దేశాలలో 7264మంది అభిప్రాయాలను సేకరించి బీఐ సంస్థ ఈ నివేదికను రూపొందించింది. కాగా ప్రతీ పదిమంది భారతీయుల్లో ఆరుగురు పూర్తి సామర్ధ్యంతో బాధ్యతలు నిర్వహించడం లేదని, యువ ఉద్యోగుల్లో తరచూ ఉద్యోగం మారే ధోరణి కనిపిస్తోందంటూ ఈ సంస్థ ఘాటు వ్యాఖ్యలను కూడా చేసింది.