గ్రీన్ కార్డు విషయంలో కూడా అమెరికా కఠినమే.. ఇబ్బందుల్లో భారతీయులు!

Friday, June 8th, 2018, 12:49:33 AM IST

అమెరికా వీసాల విషయంలో ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మిగాతా దేశాలన్నీ టాలెంట్ ఉన్నవారికి స్వాగతం పలుకుతుంటే ఇఅమెరికా మాత్రం వీసా నిబంధలనలను కఠినతరం చేస్తు కొన్ని మాత్రమే మంజూరు చేస్తోంది. ప్రస్తుతం హెచ్‌-1బీ వీసాల ద్వారా భారతీయులు జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇక గ్రీన్ కార్డు విషయంలో కూడా అమెరికా చాలా కఠినంగానే వ్యవహరిస్తోంది. ప్రస్తుతం లక్షల్లో జనాలు అక్కడ గ్రీన్ కార్డు కోసం వేచి చూస్తున్నారు.

అందులో ఎక్కువగా భారతీయులే ఉండడం గమనార్హం. అక్కడే శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్న వారు మే 2018 నాటికి 3,95,025 మంది ప్రవాసులు గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో మంచి నైపుణ్యం కలిగిన భారతీయులు 3,06,601మంది ఉన్నారు. ఈ విషయాన్ని ఇటీవల యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌) అధికారికంగా ఒక ప్రకటన ద్వారా తెలిపింది. చైనాకు చెందిన వారు 67,031 మంది గ్రీన్ కార్డ్ కోసం వేచి చూస్తుండగా మిగతా దేశాలకు చెందిన వారు పది వేలకు పైగానే ఉన్నారు.

అయితే అమెరికా మాత్రం ఒక ఏడాదిలో ఒక దేశానికి సంబంధించి 7 శాతం గ్రీన్ కార్డులను మాత్రమే అమలు చేస్తోంది. దీని వల్ల భారత ఎన్నారైలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న వారికి ఇంకా గ్రీన్ కార్డు లభించడం లేదు. ఇక భారత పిల్లల భవిష్యత్తు ఇబ్బందుల్లో పడుతుందని ఈ విషయంలో కొంత మార్పు రావాలని కాంగ్రెస్ కు చెందిన అక్కడి నేతలు ట్రంప్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.