ఇంటర్నెట్ హల్ చల్ : సరైనోడి రికార్డ్ .. కోహ్లి బ్రేక్ అప్.. ఫ్రీడమ్ ఎంట్రి..!

Tuesday, February 2nd, 2016, 12:10:13 AM IST

సరైనోడు పంజా విసిరితే.. రికార్డులు బద్దలు : అల్లు అర్జున్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో వస్తున్న సినిమా సరైనోడు.. ఈ సినిమా అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల కాబోతున్నది. ఇక ఇదిలా ఉంటే, ఈ సినిమా టీజర్ ఈనెల 18 న సాయంత్రం నాలుగు గంటల సమయంలో విడుదలైంది. ఇక విడుదలైన దగ్గరి నుంచి టీజర్ సంచలనాలు సృష్టిస్తున్నది. కేవలం 34 గంటలలోనే ఈ టీజర్ మిలియన్ హిట్స్ ను సాధించింది. ఇక ఇప్పటివరకు తెలుగులో అల్లు అర్జున్ సరైనోడు టీజరే రికార్డ్. గతంలో ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో పేర ఆ రికార్డ్ ఉండేది. 36 గంటల్లో మిలియన్ హిట్స్ అందుకుంటే.. ఇప్పుడు సరైనోడు ఆ రికార్డ్ ను బ్రేక్ చేస్తూ 34 గంటల్లోనే రికార్డ్ ను సాధించింది.

వీడియో కోసం క్లిక్ చేయండి

కోహ్లి.. అనుష్క బ్రేక్ అప్..: అటు బాలీవుడ్ లోను, ఇండియా క్రికెట్ టీం లోను హాట్ గా జరుగుతున్న చర్చ ఏమిటి అంటే..కోహ్లి.. అనుష్క శర్మల గురించే. వరికేమైంది అనే డౌట్ రావొచ్చు. ఇద్దరికీ ఏమి కాలేదు. కాకపోతే వారి లవ్ కు అంతరాయం కలిగింది. అంటే బ్రేక్ అప్ అన్నమాట. మొన్నటి వరకు ఒకరిని వదిలి ఒకరు ఉండలేనంటగా ఘాటుగా ప్రేమించుకున్న ఈ ఇద్దరు.. సడెన్ గా బ్రేక్ అప్ అయ్యారు. ఇక, అనుష్క లవ్ విషయం గురించి కాని, బ్రేక్ అప్ గురించి గాని కోహ్లిని అడిగితే గయ్య్ మని లేస్తున్నారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది.

చీప్ మొబైల్ అంటూ వచ్చి మార్కెట్ కొల్లగొట్టింది..: ఇండియాలోనే కాదు అటు ప్రపంచంలోనే చీపెస్ట్ మొబైల్ ను అందిస్తున్నామని రింగింగ్ బెల్స్ సంస్థ ముందుకు వచ్చింది. ఫ్రీడమ్ 251 పేరుతో రింగింగ్ బెల్స్ సంస్థ మొబైల్ ను తయారు చేస్తున్నది. డైరెక్ట్ గా ఆన్ లైన్ మార్కెట్ లోనే విక్రయిస్తామని సదరు సంస్థ పేర్కొన్నది. మొదట్లో ఈ మొబైల్స్ ధర 500 రూపాయలుగా ప్రకటించినా.. తరువాత దానిని 251 రూపాయలకు తగ్గించింది. ఇంత భారీగా తగ్గించడంతో యువత మొత్తం ఈ మొబైల్ వైపు దృష్టిసారించారు. ఎలాగైనా దీనిని సొంతం చేసుకోవాలని ప్రయత్నించడంతో.. సైట్ ఒక్కసారిగా క్రాష్ అయింది. ఇక, 18 వ తేది ఉదయం 6 గంటల నుంచి బుకింగ్ ప్రారంభమవుతుందని రింగింగ్ బెల్స్ ప్రకటించింది. దీంతో లక్షలాది మంది బుకింగ్ కోసం ట్రై చేయడంతో సైట్ ఆగిపోయింది. ఇక సెకనుకు 6 లక్షల హిట్స్ అందుకున్నది ఫ్రీడమ్ 251. ఇది సెర్చ్ ఇంజన్ గూగుల్ కంటే 15 రెట్లు అధికం. గూగుల్ సెకనుకు 40వేల హిట్స్ వస్తాయి.

అడవికే కాదు.. నదికి నిప్పు అంటుకున్నది : అడవికి నిప్పు అంటుకొని అడవి కాలిపోవడం మనం చూశాం. నిప్పు అంటుకుంటే.. దానిని నీళ్ళు పోసి ఆర్పివేస్తాం. అదే నిప్పు నీళ్ళకు అంటుకుంటే.. నీళ్ళకు నిప్పు అంటుకోవడం ఏమిటి అంటారా.. అక్కడే ఉన్నది అసలు సంగతి.. ఇటీవలే థాయ్ ల్యాండ్ లో కొంతమంది మత్య్సకారులు చేపలు పట్టేందుకు నదిలోకి వెళ్లారు. అయితే, అందులో ఆకుపచ్చరంగులో పదార్ధం కనిపించింది. వెంటనే జాలరులు దానికి నిప్పు అంటించారు.. అంతే.. అది భగ్గున మండింది.. కాసేపు.. అలా నదిలో మంటలు ఏర్పడ్డాయి. ఇక మంటలు ఆరిపోయిన తరువాత నీరు వేడిగా ఉండటం విశేషం.

వీడియో కోసం క్లిక్ చేయండి