నీరవ్ మోడీని భారత్ కు రప్పించే ప్రయత్నాలు సఫలమవుతాయా?

Monday, June 11th, 2018, 03:39:40 PM IST

ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంకు ను మోసగించి వేల కోట్లరూపాయల మేర కుచ్చుటోపీ పెట్టి లండన్ పారివైపోయిన సంగతి విదితమే. అయితే అప్పట్లో అతను, అతని మామ చోక్సి చేసిన మోసం వల్ల ఆ బ్యాంకు పేరు, పరపతి చాలా వరకు దెబ్బతిన్నది. అంతేకాదు ఈ ఘటన జరిగిన మరుసటిరోజే పంజాబ్ నేషనల్ బ్యాంకు షేర్లు కూడా భారీస్థాయిలో పతనమయి మదుపరులకు తీవ్ర నష్టాలను మిగిలిచాయి. అయితే ఆ మోసం వెలుగులోకి రాక ముందే లండన్ జారుకున్న నీరవ్ మోడీని అప్పటినుండి భారత్ కు రప్పించే ప్రయంత్నలు మన ప్రభుత్వం ఎంత చేస్తున్నప్పటికీ అవి సఫలీకృతం కావడంలేదు. కాగా ప్రస్తుతం లండన్ లో అతడు పొలిటికల్ ప్రాసిక్యూషన్ పేరుతో అక్కడే ఆశ్రయం పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.

అయితే దీనికి సంబంధించి అక్కడ కొన్ని మీడియాల్లో కథనాలు కూడా ప్రసారమయ్యాయని అంటున్నారు. కానీ ఈ విషయమై బ్రిటన్ మీడియా స్పందించడానికి ముందుకు రాలేదు. నిజానికి తాము వ్యక్తిగత కేసులకు సంబందించిన సమాచారం ఇవ్వజాలమని అంటోంది, అలానే నీరవ్ కూడా ఈ విషయమై స్పందించక మౌనం వహించినట్లు తెలుస్తోంది. కాగా నీరవ్ మోడీ, అతని మామ మెహుల్ చోక్సి కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంకు ను మొత్తంగా రూ.13,578 కోట్ల మేర చేసిన ఈ మోసం దేశం మొత్తం తీవ్ర సంచలనం రేపింది. ఇప్పటికే బ్యాంకులను కొన్ని వేలకోట్ల మేర ముంచేసి లండన్ పరారైన విజయ్ మాల్యా కూడా లండన్ లోనే ఉండడం గమనార్హం…..