జూనియర్ కొత్తపార్టీ పెడుతున్నడా..?

Sunday, April 10th, 2016, 02:05:47 PM IST


2009 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక, జూనియర్ ప్రచారానికి విపరీతమైన ప్రచారం లభించింది. ఎక్కడకు వెళ్ళినా అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జూనియర్ కు బ్రహ్మరధం పట్టారు. ఇక జూనియర్ మాట తీరు కూడా ఆకట్టుకోవడంతో.. భవిష్యత్తులో ఎన్టీఆర్ తప్పకుండా బడానాయకుడు అవుతారని పలువురు రాజకీయ నాయకులు విశ్లేషించారు.

అయితే, తెలుగుదేశం పార్టీలో జరిగిన పరిణామాల కారణంగా జూనియర్ ను పార్టీ పక్కన పెట్టింది. అయినప్పటికీ.. పార్టీ ఎప్పుడు పిలిచినా పార్టీకి సేవ చేసేందుకు సిద్దం అని ఎన్టీఆర్ పలుమార్లు పేర్కొన్నారు. కాని, జూనియర్ ను పార్టీ పూర్తిగా పక్కన పెట్టింది. జూనియర్ ను పార్టీలోకి తీసుకొస్తే.. లోకేష్ ప్రాబల్యం తగ్గిపోతుందనే ఉద్దేశ్యంతోనే ఎన్టీఆర్ ను పక్కన పెట్టినట్టు భోగట్టా.

ఇక, నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరి.. ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు. ఎమ్మెల్యేగా బాలకృష్ణ గెలిచినా తరువాత.. పార్టీలో బాలయ్య హవా పెరిగింది. దీంతో ఎన్టీఆర్ ను పూర్తిగా పార్టీ దూరం చేసినట్టే అని తెలుస్తున్నది. అయితే, ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ సినిమా రంగంలో బిజీగా ఉన్నారు. వరస హిట్స్ ఇస్తూ మంచి ఊపుమీదనే ఉన్నారు. ఇకపోతే, ఇప్పుడొక వార్త మీడియాలో హల్ చల్ చేస్తున్నది. జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే పార్టీ పెట్టబోతున్నారని.. తెలుగుదేశం పార్టీకి పోటీగా ఆ పార్టీ ఉంటుందని సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు కాని, ఈ వార్త మాత్రం విపరీతంగా ట్రెండ్ అవుతున్నది. మరి జూనియర్ నిజంగానే పార్టీపెడితే.. తెలుగుదేశం పార్టీలోని నాయకులు ఎంతమంది జూనియర్ వైపు వస్తారు… జూనియర్ పార్టీ పోటీ చేస్తే ఎన్ని సీట్లు గెలుస్తుంది అనే విషయంపై ఇప్పుడే లెక్కలు వేస్తున్నారు.