‘సర్వే’ నిజాలు.. మరో ఆప్షన్ పవనేనా..?

Sunday, June 5th, 2016, 09:52:15 AM IST


రాజకీయాలలో ఇప్పుడు మార్పు చాలా అవసరం. 2014 సమయంలో మార్పు కావాలని, రాష్ట్రాన్ని ఆడుకోవలసిన వ్యక్తి యొక్క అవసరం ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చారు. అయితే, రెండేళ్ళ పాలనలో చంద్రబాబు నాయుడు ఎంతవరకు సక్సెస్ అయ్యారు అన్నది మనకు స్పష్టంగా తెలుస్తూనే ఉన్నది. ఇక ఇండియా టుడే సర్వే ప్రకారం దేశంలో ప్రజలకు మేలు చేస్తున్న, వారి మన్ననలు పొందిన ముఖ్యమంత్రిగా కెసిఆర్ మొదటి స్థానంలో నిలిచారు. 86% మంది ఆయనకు ఓటు వేయగా, చంద్రబాబు కు కేవలం 69% మాత్రమే ఈ విషయంలో ఓటు వేశారు.

ఇక దీనిని పక్కన పెడితే, ప్రతిరోజూ అధికార పక్షానికి, ప్రతి పక్షానికి మధ్య మాటల యుద్ధం, ర్యాలీలు ధర్నాలతోనే కాలం గడిచిపోతున్నది తప్పించి అభివృద్ధి విషయం మాత్రం ముందుకు సాగడంలేదు. అమరావతి నిర్మాణం ఎప్పుడికి పూర్తవుతుందో తెలియడంలేదు. మరోవైపు కేంద్రం అమరావతి విషయంలో ఎంతవరకు సహకరిస్తుందో కూడా స్పష్టంగా తెలియడంలేదు. ఇన్నింటిమధ్య, ఇన్ని గొడవల మధ్య వచ్చే ఎన్నికలలో ప్రజలు మరోసారి చంద్రబాబుకు పట్టం కడతారా అంటే కష్టమనే తెలుస్తున్నది. ప్రజలు మరో ఆప్షన్ కింద పవన్ ను అనుకుంటున్నట్టు తెలుస్తున్నది.

ఇది ఇప్పటివరకు కేవలం ఆప్షన్ మాత్రమే. ఖచ్చితంగా అనిమాత్రం చెప్పలేం. ఎందుకంటే రెండేళ్ళలో ఏదైనా జరగోచ్చు.. ఎన్ని మార్పులైనా రావొచ్చు. జనాలను ఆకట్టుకునే మాత్రం బాబువేయవచ్చు. లేదా రాష్ట్రం మూడేళ్ళలో అభివృద్ధి పధంలో పరుగులు తీయవచ్చు. ఈ మూడేళ్ళలో ఎన్నో జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పవన్ ను కేవలం ఆప్షన్ కింద పెట్టుకున్నారు.