ఇదే మంచి తరుణం.. జగన్ తగ్గిన చోట పవన్ నెగ్గుకు రావాలి..!

Friday, April 15th, 2016, 08:30:59 AM IST


ఆంధ్రప్రదేశ్ లో ఆపరేషన్ ఆకర్ష్ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. చంద్రబాబు వ్యూహాలకు, పథకాలకు అపోజీషన్ పార్టీలు బెంబేలెత్తుతున్నాయి. చంద్రబాబు స్కీములకు నాయకులు ఎట్రాక్ట్ అవుతున్నారు. దీంతో ప్రతిపక్షపార్టీనుంచి నాయకులు, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా సైకిల్ ఎక్కుతున్నారు. ఇప్పటికే 11 మంది వైకాపా ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరారు. విజయ నగరం బొబ్బిలి నుంచి మరో వైకాపా ఎమ్మెల్యే, కొంతమంది నేతలు శ్రీరామ నవమి అయిన నేడు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు.

ఇకపోతే, ఇప్పుడు మనకు మరో వార్తా వినిపిస్తున్నది. ప్రకాశం జిల్లాలో బలంగా ఉన్న వైకాపాకు దెబ్బ తగలబోతున్నట్టుగా కనిపిస్తున్నది. వైకాపానుంచి పోటీ చేసి ఒడిపోయిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలుగుదేశం పార్టీ చేరబోతున్నారని సమాచారం అందుతున్నది. జిల్లా నుంచి అద్దంకి, గిద్దలూరు, కందుకూరు, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్దంగా ఉన్నట్టు సమాచారం. ఇదే జరిగితే.. వైకాపాకు గట్టిదెబ్బ తగిలినట్టె. వైకాపాకు ప్రకాశం జిల్లా చాలా కీలకమైన జిల్లా. ఇక్కడ వైకాపా కు దెబ్బ తగిలింది అంటే కోలుకోవడం కష్టం అవుతుంది.

ఇక, ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్, త్వరలోనే పూర్తిస్తాయి రాజకీయాలలోకి రాబోతున్నారు. పూర్తగా రాజకీయాలలోకి రాబోయే ముందు, పవన్ బస్సు యాత్ర ద్వారా ప్రజల సమస్యల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ఇలా బస్సు యాత్ర చేపట్టేందుకు ఇదే మంచి తరుణం. ఎందుకంటే.. వైకాపా నుంచి ఒక్కొక్కరుగా బయటకు పోతున్న ఈ తరుణంలో.. పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర చేపడితే.. ఎక్కడైతే వైకాపా బలహీన పడుతున్నదో.. అక్కడ సంస్థాగతంగా జనసేన మొదట బలపడేందుకు అవకాశాలు పెంచుకోవచ్చు. తద్వారా జనసేన పార్టీ తన రాష్ట్రంలో విస్తరించడానికి అవకాశాలు ఏర్పడతాయి. మరి పవన్ మనసులో ఎలా ఉన్నదో.. ఎలాంటి వ్యూహాలను అనుసరించబోతున్నారో త్వరలోనే తెలుస్తుంది.