జగన్ వారిపై కక్ష తీర్చుకునే మార్గం ఇదే

Monday, August 5th, 2019, 07:51:41 AM IST

లక్ష కోట్లు అవినీతి జరిగిందని జగన్ మోహన్ రెడ్డిని నెలలు తరబడి జైలు గోడలకి పరిమితం చేశాడు. అక్రమాస్తుల విషయంలో జగన్ పై అనేక కేసులు పెట్టారు, కానీ నేడు అవన్నీ డొల్ల కేసులని న్యాయస్థానాలు తీర్పునిస్తున్నాయి. అప్పట్లో తమని ఎదిరించాడని కాంగ్రెస్,తమకి ఎక్కడ పోటీగా వస్తాడేమో అని తెలుగుదేశం రెండు కలిసి జగన్ మీద అనేక కేసులు పెట్టినట్లు ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే అర్ధం అవుతుంది.

జగన్ పబ్లికేషన్,పెన్నా ఆస్తులు,భారతి సిమెంట్,వాన్ పిక్ ఇలా జగన్ మీద పెట్టిన అన్ని కేసుల్లో ఇప్పుడు జగన్ కి అనుకూలంగా తీర్పులు వస్తున్నాయి. గతంలో న్యాయస్థానాలు ఎందుకు ఇలాంటి తీర్పు ఇవ్వలేదో మాత్రం మనం మాట్లాడుకోవటం అనవసరం. ఇక్కడ విషయం ఏమిటంటే వాన్ పిక్ విషయంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని న్యాయస్థానము తీర్పు ఇచ్చింది కాబట్టి, దానిని డెవలప్ చేసే విధంగా జగన్ ముందుకి వెళితే చాలా మంచిది.

గుంటూరు,ప్రకాశం జిల్లాలో దాదాపు 11 వేల ఎకరాలు దానికి కేటాయించారు . దానిని డెవలప్ చేసి పరిశ్రమలు వచ్చేలా చేస్తే రాష్ట్ర చరిత్రలో జగన్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. గతంలో వైఎస్ కి అలాంటి పేరు వస్తుందంటే కుట్రతోనే వాన్ పిక్ ని వివాదాల మాయం చేశారు “కొందరు”. ఇప్పుడు దానినే జగన్ డెవలప్ చేసి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటే చాలు.. ఆలా కాకుండా వాళ్ళ మీద వీళ్ళ మీద కక్ష సాధింపు చర్యలకి దిగితే ఎలాంటి లాభం లేదు సుమీ