ఈ సారి విదేశీ గడ్డపై “జనసేన” భారీ కవాతు..సక్సెస్ అవుతుందా..?

Monday, December 10th, 2018, 03:59:05 PM IST

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోని రోజురోజుకి వినూత్నంగా దూసుకెళ్ళిపోతున్నారు.ఆయన యొక్క కార్యకర్తలు అభిమానులతో పవన్ సరికొత్త పద్ధతులను పెట్టి వారి పార్టీని ప్రజలకు మరింత చేరువయ్యేలా చేస్తు అనూహ్య రీతిలో స్పందన రాబట్టి విజయాన్ని సొంతం చేసుకున్నారు.అయితే “జనసేన” పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న కీలక ఘట్టాల్లో జనసేన కవాతు అనే అధ్యాయాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

గోదావరి జిల్లాల్లో ధవళేశ్వరం బ్యారేజి మీద మరియు మొన్న అనంతపురం లో కరువు మీద నిర్వహించిన కవాతులు రెండు అద్భుత విజయాన్ని సాధించాయి.అయితే ఇప్పుడు జనసేనాని మరో భారీ కవాతుని నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.అయితే ఈ సారి మాత్రం మన దేశం లో కాదు విదేశీ గడ్డ మీద తన బలాన్ని చూపించబోతున్నారట.పవన్ కి ప్రజల్లో అశేషమైన ప్రజాధారణ ఉందని అందరికి తెలుసు,అది ఖండాంతరాలు దాటి కూడా ఉందని తెలుసు. అయితే ఇప్పుడు అమెరికా లో ఉండేటువంటి ప్రవాసాంధ్రులతో జనసేన అధినేత భారీ కవాతునిర్వహించనున్నారట.

ఈ నెల 15వ తేదీన అమెరికా డల్లాస్ లోని,జనసేన కవాతు మరియు ప్రవాస గర్జన నిర్వహిస్తున్నామని తెలిపారు.ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఎన్నారై లు జనసేనాని ప్రసంగించే సభను సంసిద్ధం చేస్తున్నారు.మధ్యాహ్నం 1:30 నిమిషాలకు దాదాపు 10000 మందితో కవాతు ప్రారంభం కానుంది అని తెలుస్తుంది.అంతే కాకుండా సాయంత్రం 3:30 నిమిషాలకు థామస్ జెఫర్ సన్ పార్క్ నుంచి 1000 కార్లతో భారీ ర్యాలీతో పవన్ ప్రసంగించనున్న టయోటా మ్యూజిక్ ఫ్యాక్టరీ వరకు కొనసాగనుంది అని జనసేన శ్రేణులు తెలుపుతున్నారు.ఇక్కడ తన కవాతుతో అద్భుత విజయాన్ని సాధించిన పవన్ అక్కడ కూడా విజయాన్ని సాధిస్తారో లేదో వేచి చూడాలి.