పవన్ ఆ విషయంలో స్పష్టంగా ఉన్నాడట.. బరిలోకి దిగటమే ఆలస్యమా..?

Friday, April 22nd, 2016, 08:16:49 AM IST


జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరో రెండు సంవత్సరాలలో పూర్తిస్తాయి రాజకీయాలలోకి ప్రవేశించబోతున్నారు. రెండు సినిమాలు చేసి సినిమా నుంచి పక్కకు తప్పుకొని రాజకీయాలపై దృష్టి సారించాలని ఇప్పటికే పవన్ నిర్ణయించుకున్నారు. ఇక, రాజకీయాలలోకి వస్తాను అని చెప్పిన మరుసటిరోజు పవన్ కళ్యాణ్ విజయవాడలో జనసేన నాయకులతో రహస్యంగా సమావేశం జరిపారని సమాచారం. బలాబలాలు భేరీజు చేసుకుంటున్నారని.. కలిసి వచ్చే ప్రతి అంశాన్ని పవన్ వినియోంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.

ఇక, పవన్ పార్టీ జనసేనకు ఇప్పటికే స్థానిక సంస్థల నుంచి మంచి మద్దతు ఉన్నది. మీడియా పరంగా కూడా మద్దతు లభిస్తున్నది. పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ అంటే మీడియా మొత్తం హారజవుతున్నది. అయితే, ఇప్పటి వరకు పవన్ ప్రత్యక్షంగా రాజకీయాలోకి దిగలేదు కాబట్టి.. పవన్ గురించి పెద్దగా ఎవరు కూడా కామెంట్స్ చేయడంలేదు. పవన్ రాజకీయాలలోకి వస్తానంటే.. రమ్మనే పైకి చెప్తున్నా.. చాలా మంది నాయకులకు పవన్ రాజకీయాలలోకి రావడం ఇష్టంలేనట్టుగానే కనిపిస్తున్నది. ఎందుకంటే.. 2014 లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ ఒక కారణం.

యువత, ఒక వర్గంలోని ప్రజల ఓట్లు పవన్ చెప్పడం వలనే తెలుగుదేశం పార్టీకి పడ్డాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వస్తే.. ఆ ఓట్లు చీలిపోతాయి. ఒకవేళ ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేఖత ఉంటె..మిగతా ఓట్లు కూడా చీలిపోయే అవకాశం ఉంటుంది.

ఇక, కాంగ్రెస్ పార్టీలో ఉన్న చిరంజీవితో రాజకీయంగా శతృత్వం ఉంటుందని, రాజకీయంగా చిరు ప్రత్యర్దే అని ఇప్పటికే పవన్ ప్రకటించారు. 2019 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో చేతులు కలుపుతారా లేదా అన్నది ఇప్పటికీ అనుమానమే.

మనకు అందిన, అందుతున్న సమాచారం ప్రకారం.. జనసేన పార్టీ ఇప్పటికిప్పుడు ఎన్నికలలో పోటీ చేస్తే.. కనీసం 40 పైగా సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. అంటే, ఇప్పటి నుంచి కనుక పవన్ క్షేత్రస్థాయిలో బలపడేందుకు ప్రయత్నాలు చేస్తే.. 2019 నాటికి ఒక బలమైన శక్తిగా అవతరిస్తుంది అనడంలో సందేహం లేదు.