“జనసేన” పార్టీ వింతగా ప్రజల్లోకి..ఎలాగో తెలిస్తే షాక్ అవుతారు.!

Thursday, November 1st, 2018, 08:26:19 PM IST


రాజీకీయాల్లోని ప్రతీ ఒక్క పార్టీ నాయకుడు తమ పార్టీని ప్రజల్లో నిలుపుకోవడానికి చేసే ఏకైక పని ప్రచారం.అయితే వారు వారి పార్టీని ఏ విధంగా ప్రచారం చేసుకుంటున్నారు అన్నది ముఖ్యం.కొంతమంది టీవీల్లో ప్రకటనలు ఇస్తారు,పేపర్లలో ప్రకటనలు ఇస్తారు,పెద్ద పెద్ద ఫ్లెక్సీలను కడతారు.మైక్ పెట్టి గ్రామాల్లో ఆటోలలో ప్రచారం చేస్తారు.ఇంకా చాలా రకాలుగా వారి యొక్క పార్టీని ప్రచారం చేసుకుంటారు.కానీ పవన్ యొక్క అభిమానులు మాత్రం కొత్తగా ఆలోచించడంలో ఎప్పుడు ముందుంటారు అని మనకి తెలుసు ఇప్పుడు కూడా అదే విధంగా జనసేన పార్టీని వారి యొక్క సిద్ధాంతాలని మరియు పార్టీ యొక్క ప్రీ మేనిఫెస్టోని ప్రజలకు మరింత చేరువయ్యేలా చెయ్యడానికి పూనుకున్నారు.

ఇప్పటికే పవన్ యొక్క అభిమానులు పవన్ యొక్క ఫోటోని వారి యొక్క పెళ్లి కార్డుల్లో వేయించుకోడం చూసాము కానీ చిట్టవరం నరసాపురం లోని జగన్ మోహన్ అనే వ్యక్తి ఏకంగా తన పెళ్లి కార్డులలోనే జనసేన యొక్క ప్రీ మ్యానిఫెస్టోని పొందుపరిచి వారి బంధువులు అందరికి పంచి పెళ్ళికి ఆహ్వానిస్తున్నారు.దానితో వారి పార్టీ యొక్క మ్యానిఫెస్టో యొక్క ఆవశ్యకత ప్రజలకు మరింత చేరువయ్యేలా చేస్తున్నారని అర్ధమరుతుంది. మొత్తానికి జనసేన పార్టీని వారి అభిమానులు ఇలా కొత్తగా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు.