అమ్మ పుట్టినరోజు వేడుకలకు రంగం సిద్దం

Wednesday, February 18th, 2015, 05:20:31 PM IST


తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అమ్మ జయలిత పుట్టిన రోజు వేడుకలను అంగరంగ వైభోగంగా నిర్వహించేందుకు అన్నాడీఎంకె పార్టీ ఏర్పాట్లు చేస్తున్నది. అక్రమ ఆస్తుల కేసులో ఇటీవలే జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. అక్రమాస్తుల కేసులో గరిష్టంగా నాలుగు సంవత్సరాల పాటు జైలుశిక్ష కనుక పడితే… పదేళ్ళ పాటు ఎన్నికలలో పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటిస్తూ… రాజ్యాంగంలో సవరణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో జయలలిత పది సంవత్సరాల పాటు పోటీచేసేందుకు వీలులేదు.

ప్రస్తుతం జయలలిత అన్నాడిఎంకె పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఈ నెల 20న అధినేత్రి పుట్టినరోజు. అమ్మ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ భావిస్తున్నది. దాదాపు పదిరోజుల పాటు వేడుకలను అటు తమిళనాడులోను ఇటు తెలుగురాష్ట్రాలలోను నిర్వహించాలని పార్టీ భావిస్తున్నది. ఇందుకోసం ఇప్పటికే పార్టీ అన్ని ఏర్పాట్లు చేసింది.