జైల్లో కుప్పకూలిన జయ

Tuesday, October 7th, 2014, 06:12:39 PM IST


తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో దోషిగా తేలడంతో బెంగుళూరు పరప్పన అగ్రహార జైలులో ఖైదుగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే జయ బెయిల్ విచారణ మంగళవారం కర్ణాటక కోర్టులో జరిగింది. కాగా తనకు బెయిల్ మంజూరు అవుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న జయలలితకు కోర్టులో చుక్కెదురైంది. అవినీతి అంటే మానవ హక్కుల ఉల్లంఘనే అని సుప్రీం కోర్టు చెప్పిన సంగతిని గుర్తు చేస్తూ కర్ణాటక హైకోర్టుజయకు బెయిల్ ను నిరాకరించింది. దీనితో అప్పటి వరకు జైలులో ఉత్కంఠగా టీవీ చూస్తున్న జయలలిత ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఇక డాక్టర్లు ఆమెకు హుటాహుటిన వైద్యం అందిస్తున్నారు.

అయితే 1996లో జయ అక్రమాస్తులను కలిగి ఉన్నారని కేసు పెట్టిన సుబ్రహ్మణ్యస్వామి జయకు బెయిల్ రాకపోవడంపై స్పందించారు. ఆయన మాట్లడుతూ ‘జయకు బెయిల్ రాకపోవడంలో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. బెయిల్ రాదని నేను ముందే ఊహించా’ అంటూ వ్యాఖ్యానించారు.