బీజేపిలోకి జయప్రద

Thursday, January 15th, 2015, 12:57:03 PM IST


సినీనటి, సమాజ్ వాది మాజీ ఎంపి జయప్రద బీజేపిలో చేరుతున్నారు. ఈ మేరకు ఆమె ఇప్పటికే బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో చర్చలు కూడా జరిగినట్టు తెలుస్తున్నది. సమాజ్ వాది పార్టీతో ఆమె ఇప్పటికే తెగతెంపులు చేసుకున్నారు. అయితే, ఆమె వివిధ పార్టీల నేతలను గతంలో కలిసి చర్చలు కూడా జరిపారు. అయితే, చివరకు జయప్రద బీజేపిలో చేరేందుకు సిద్దమయింది. ఇది ఇలా ఉంటే, ఏఏపీ నేత అరవింద్ కేజ్రీవాల్ పై జయప్రద పోటీ చేస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. బీజేపి ఆమెను కేజ్రీవాల్ పై పోటీకి దించేందుకు ఉత్సాహం చూపుతున్నట్టు తెలుస్తున్నది. అయితే, దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఢిల్లీ అసెంబ్లీలో బీజేపి విజయం సాధిస్తుందని ముందస్తు సర్వేలు చెప్తున్నాయి. అయితే, అరవింద్ కేజ్రీవాల్ పై పోటీకి బలమైన అభ్యర్ధి కోసం బీజేపి అన్వేషణ సాగిస్తున్నది. ఇందులో భాగంగానే జయప్రద పేరు తెరమీదకు వచ్చినట్టు కూడా తెలుస్తున్నది. ఇక, ముందస్తు సర్వే ప్రకారం, బీజేపి కనుక విజయం సాధిస్తే, జయప్రద సిఎం రేసులో ఉంటుందనే ఊహాగానాలు కూడా వస్తున్నాయి.