జయరాం మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ వీడిన‌ట్టేనా?

Wednesday, February 27th, 2019, 10:45:52 AM IST

పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో అస‌లేం జ‌రుగుతోంది? విచార‌ణ స‌వ్యంగా సాగుతోందా? అంటే దానికి డీసీపీనే స‌మాధానం ఇచ్చారు. ఇంత‌వ‌ర‌కూ ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశామ‌ని హైద‌రాబాద్‌ వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ కేసులో రాకేష్‌తో పాటు విశాల్, నగేష్ అనే ఇద్దరి పాత్ర ఎంతో కీల‌క‌మైన‌ద‌ని, విశాల్ అనే వ్యక్తి హత్య జరిగినప్పుడు రాకేష్ తో కలిసి అక్కడే ఉన్నాడని వెల్ల‌డించారు. నగేష్ అనే వ్యక్తి కొన్ని వీడియోలు తీసిన దాంట్లో సహకారం అందించాడు. సుభాష్ చంద్ర రెడ్డి అనే వ్యక్తి రాకేష్ రెడ్డి కి స్నేహితుడు , అతని నుండి కొన్ని మర్డర్ కి సంబంధించిన వస్తువులు స్వాధీనం చేసుకున్నామ‌ని వెల్ల‌డించారు. హత్య జరిగిన తరువాత రాకేష్ రెడ్డి ఒక్కడే డెడ్ బాడీ ను తీసుకెళ్లాడు. డెడ్ బాడీ ని మొత్తం 10 మంది చూసి ఉంటారు. చూసిన వాళ్ళు అందరికి ఈ హత్య కేసుతో సంబంధం లేదు.

రాకేష్ రెడ్డి జయరాంను మర్డర్ చేస్తున్నప్పుడు కొన్ని వీడియోలు, ఫోటోలు సుభాష్ చంద్ర రెడ్డి కి పంపాడు.ఫథకం ప్రకారం కిడ్నాప్ చేసి హత్య చేశారు. బెదిరించి కొన్ని డాక్యుమెంట్లు పై సంతకాలు తీసుకున్నారు. ప్ర‌స్తుతం పోలీసు ఉన్నతాధికారుల‌ ప్రమేయం పై విచారణ కొనసాగుతోంది. ఐదుగురు పోలీసులకు నోటీసులు ఇస్తాం. విచారిస్తామ‌ని తెలిపారు. శికా చౌదరి కి ఈ మర్డర్ తో ఏ సంబందం లేదని రాకేష్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చాడు. జయరాం హత్యకు గుర‌య్యార‌ని కార్‌ డ్రైవర్ శికా చౌదరికి చెప్పాడు. ఈ కేసులో 100 మందిని పైగా విచారించాం. ఈ కేసులో శికా చౌదరిపై నమోదైన అక్రమ చొరబాటు, డాక్యుమెంట్లు ఎత్తుకెళ్లారు అనే రెండు అభియోగాల‌పై కేసు నమోదు చేశాం. ఈ కేసులో విచారణ కొనసాగుతోంది.