చెల్లెమ్మ రాయభారం

Monday, September 22nd, 2014, 01:15:40 PM IST


తమిళనాడులోని డీఎంకె పార్టీలో అళగిరి, స్టాలిన్ లమధ్య వివాదం చిలికి చిలికి గాలివానలా మారిన విషయం తెలిసిందే. ఈ వివాదంలో భాగంగా అళగిరి డీఎంకె పార్టీ నుంచి బయటకి వచ్చేశాడు. రాబోయే ఎన్నికలలో డీఎంకె అధినేత కరుణానిధినే ముఖ్యమంత్రి అభ్యర్ధిగా పోటీచేస్తాడని స్టాలిన్ ప్రకటించడంతో వివాదం మరింత ముదిరింది. అళగిరి డీఎంకె అధిష్టానంపై విరుచుకుపడ్డారు.. స్టాలిన్ వ్యాఖ్యలపై విమర్శలు గిప్పించారు. అళగిరి చేసిన వ్యాఖ్యలతో, ఆయనకు పార్టీకి మధ్య మరింత అగాధం ఏర్పదింది.

ఇప్పుడు ఈ అగాధాన్ని పూడ్చే భాద్యతను కరుణానిధి గారాల పట్టి కనిమొళి స్వీకరించింది. పెద్దన్నయ్య అళగిరిని తిరిగి పార్టీలోకి ఆహ్వానించేందుకు ఆమె కరుణానిధితో చర్చలు జరుపుతున్నది. సొంతపార్టీలో ఉన్న గొడవల కారణంగా ఇతరపార్టీలు లాభపడతాయని ఆమే కరుణానిధితో జరిపిన భేటీలో పేర్కొన్నట్టు తెలుస్తున్నది. అంతేకాకుండా దక్షిణ తమిళనాడులో పార్టీ బలపడాలంటే, పెద్దన్నయ్య అళగిరిని పార్టీలోకి ఆహ్వానించాలని ఆమే పట్టుబడుతున్నారు.

ఎప్పుడు చెల్లెమ్మ గడప తొక్కని అళగిరి, స్టాలిన్ తో జగిరిన వివాదం కారణంగా మొదటిసారి కనిమొళి ఇంటికి వెళ్లి తన గోడును చెప్పుకున్నాడు. అన్నయ్య పార్టీకి ఎక్కడ శాశ్వతంగా దూరం అవుతాడోనని భావించిన కనిమొళి వ్యవహారాన్ని చక్కదిద్దటానికి రంగంలోకి దిగింది. మరి, ఈ చెల్లెమ్మ రాయభారం ఫలిస్తుందో లేదో వేచి చూడాలి.. అన్నయ్య అళగిరి అంటేనే ఒంటికాలుమీద కస్సుమని లేస్తున్న స్టాలిన్, కనిమొళి రాయభార వ్యవహారంపై ఎలా స్పందిస్తారో మరి..