రాష్ట్రం మొత్తం కాపు నిరసనల మయం

Friday, February 5th, 2016, 01:35:38 PM IST


కాపుల బీసీ రిజర్వేషన్ కోసం తూర్పుగోదావరి కిర్లంపూడిలో కాపు నేత ముద్రగడ పద్మనాభం మొదలుపెట్టిన ఆమరణ నిరాహార దీక్షకు రాష్ట్రం నలుమూలల నుండి విపరీతమైన మద్దత్తు లబిస్తోంది. ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లాలోకి బయటి వ్యక్తులు ఎవరూ రాకుండా పోలీసులు అడ్డుకుంటుండగా రాష్ట్రం నలు మూలల నుండి కాపులు కిర్లంపూడి వైపుకు కదులుతున్నారు. దీంతో పోలీసులు కిర్లంపూడి చుట్టూ రక్షణా వలయాన్ని ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఇదిలా ఉంటే కాపుల ప్రభావం ఎక్కువగా ఉన్న గోదావరి జిల్లాలు, ఇతర సీమ జిల్లాల్లో కాపు నేతలు వినూత్న రీతిలో నిరసన తెలుపుతూ ముద్రగడకు తమ మద్దత్తును ప్రకటిస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం విశాఖలో అత్యవసర సమావేశం నిర్వహించి పలువురు కాపు నాయకులు, ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతున్నారు.