రివ్యూ: చినబాబు – అందరికి నచ్చకపోవచ్చు!

Friday, July 13th, 2018, 05:25:58 PM IST

ఖాకి సినిమాతో తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి హిట్ అందుకున్న కార్తీ ఈ సారి డిఫెరెంట్ సినిమాతో వచ్చాడు. పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చినబాబు సినిమాను హీరో సూర్య నిర్మించడంతో కొద్దిగా అంచనాలు పెరిగాయి. కార్తీ సరసన సాయేషా నటించగా తండ్రి పాత్రలో సత్యరాజ్ నటించారు. ఇక చినబాబు సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది. ఆ సినిమా ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

కథ:

కృష్ణం రాజు(సత్యరాజ్) గ్రామానికి పెద్ద. అతను వారసుడు కావాలని కోరుకుంటాడు. అయిదుగురు కూతుళ్ళ తరువాత ఒక కొడుకు పుడతాడు. అతన్ని చినబాబు(కార్తీ) అని ముద్దగా పిలుచుకుంటారు. అయితే చినబాబు ఒక రైతుగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతాడు. తన వృత్తి ఇదే అని గర్వంగా చెప్పుకుంటూ ఉంటాడు. ఇక అనుకోని తరుణంలో నీలిమ (సాయేషా) ను చినబాబు ఇష్టపడతాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. ఇక ఈ తరుణంలో అనుకోకుండా కుటుంబంలో కొన్ని విభేదాలు ఏర్పడతాయి. పెళ్లికి సంబందించిన సమస్యలు తెలెత్తడంతో చినబాబు వాటిని ఎలా సాల్వ్ చేశాడు? చివరికి చినబాబు కుటుంబ సభ్యులను ఎలా ఒప్పించాడు? అసలు వచ్చిన సమస్య ఏమిటి? అనే విషయాలను తెరపై చూడాలి.

విశ్లేషణ:

వరుసగా కార్తీ డిఫెరెంట్ సినిమాలు ట్రై చేస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్నడని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో కార్తీ ఒక రైతుగా చాలా కొత్తగా కనిపించాడు. కార్తీ తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశాదు. అతని స్క్రీన్ ప్రజెంటేషన్ చాలా బావుంది. హీరోయిన్ తో కెమిస్ట్రీ కూడా చాలా బావుందని చెప్పాలి. హీరోయిన్ సాయేషా ఒక పల్లెటూరి అమ్మాయిలా తన పాత్రలో ట్రెడిషినల్ గా కనిపించింది.
సత్యరాజ్ తండ్రిగా అద్భుతమైన పాత్రలో నటించారు. అయిదుగురు సిస్టర్స్ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ బావున్నాయి. కానీ మధ్యలో కొంచెం హెవీ ఎమోషనల్ డ్రామా అనిపిస్తుంది. దర్శకుడు పాండిరాజ్ కొన్ని సన్నివేశాల్లో ఇంకొంచెం జాగ్రత్త వహిస్తే బావుండేది. అలాగే కథను తెరకెక్కించిన విధానం కొంచెం రెగ్యులర్ గా అనిపిస్తుంటుంది. తమిళ్ సినిమా కాబట్టి మొత్తం అక్కడి వాతావరణానికి తగ్గట్టుగా ఉంటుంది. మరి తెలుగు ప్రేక్షకులకు ఇది ఎంతవరకు నచ్చుతుందో చూడాలి.

ప్లస్ పాయింట్స్:

కార్తీ నటన ఆకట్టుకుంటుంది.
హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ
సినిమాటోగ్రఫీ

మైనెస్ పాయింట్స్:

ఓవర్ డోస్ తమిళ్ నేటివిటీ సన్నివేశాలు
లౌడ్ అండ్ హెవీ ఎమోషనల్ డ్రామా
పాటలు నేపథ్య సంగీతం

తీర్పు:

మొత్తంగా సినిమాలో కార్తీ తన యాక్టింగ్ తో అధరోగొట్టేశాడని చెప్పవచ్చు. కానీ తమిళ్ నేటివిటీకి తగ్గట్టు హెవీ ఎమోషనల్ సీన్స్ తెలుగు ఆడియెన్స్ అంతగా నచ్చకపోవచ్చు. గతంలో ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి. ఇక బి,సి సెంటర్ల వారికి సినిమా నచ్చుతుందని చెప్పవచ్చు.

నేటిఏపి రేటింగ్: 2.5/5

Reviewed by Netiap Team

Click here for English Review