గవర్నర్ సమక్షంలో పంచాయితీ

Saturday, February 14th, 2015, 11:34:48 AM IST


తెలుగు రాష్ట్రాల నడుమ ఏర్పడిన నాగార్జున సాగర్ నీటి విడుదల పంచాయితీ గవర్నర్ నరసింహన్ వద్దకు చేరింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ కాసేపటి క్రితం రాజ్ భవన్ లో గవర్నర్ సమక్షంలో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు హరీష్ రావు, దేవినేని ఉమతో పాటు ఇరు రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగార్జున సాగర్ జలవివాదంపై చర్చిస్తున్నారు. శుక్రవారం నుంచి నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద ఘర్షణ కొనసాగుతోంది. ఈ ఘర్షణపై తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ మేరకు ఈ రోజు గవర్నర్ వద్దకు చేరుకుని ఈ సమస్యకు పరిష్కారం కోసం చర్చిస్తున్నారు.