తెలంగాణలో ఏపీ పేరు కొనసాగించం!

Thursday, December 18th, 2014, 06:34:25 PM IST


రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఏ అంశంలోనూ ఆంధ్రప్రదేశ్ ప్రసక్తి ఉండకుండా చూస్తూ తెలంగాణ నేతలు అతి జాగ్రత్త తీసుకుంటున్నారు. ఈ నేపధ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ హైదరాబాద్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఢిల్లీ వెళ్ళే ఏపీ ఎక్స్ ప్రెస్ పేరును తెలంగాణ ఎక్స్ ప్రెస్ గా మార్చాలని డిమాండ్ చేస్తూ కేంద్రానికి లేఖ రాస్తానని తెలిపారు. అలాగే తెలంగాణలో నడిచే రైలుకు ఆంధ్రప్రదేశ్ పేరు కొనసాగించడం అసమంజసం అని కెసిఆర్ అభిప్రాయపడ్డారు. ఇక హైదరాబాద్ నుండి సిర్పూర్ కాగజ్ నగర్ ఎక్స్ ప్రెస్ పేరును కొమరం భీమ్ ఎక్స్ ప్రెస్ గా మార్చాలని కేంద్రానికి ప్రతిపాదిస్తూ లేఖ రాస్తానని కెసిఆర్ పేర్కొన్నారు.