సానియాకు మరోక కోటి ఇస్తారా..?

Sunday, September 28th, 2014, 03:21:02 PM IST


సానియా మిర్జా.. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్. దీనికంటే ముందు ఆమె టెన్నిస్ ప్లేయర్.. టెన్నిస్ ప్లేయర్ గా అంతర్జాతీయ స్థాయిలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న పరిస్థితులలో.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత.. సానియా మిర్జాకు కలిసి వచ్చింది. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆమెను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. అంతేకాకుండా.. శిక్షణ కోసం కోటిరూపాయలను అందజేశారు. కోటి రూపాయలను అందుకున్న సానియా యూఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ గెలిచింది.. ఈ గెలుపుతో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని.. వెంటనే సానియాకు కోటి రూపాయలను అందజేశారు. కోటిరూపాయలను అందుకున్న సానియా.. టోక్యోలో జరిగిన పాన్ పసిఫిక్ ఓపెన్ ట్రోఫిలో మహిళల డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచింది.. అనంతరం.. దక్షిణ కొరియాలోని ఇంచియాన్ లో జరుగుతున్న 17వ ఆసియా క్రీడలలో పాల్గొన్నది. మిక్స్డ్, మహిళల డబుల్స్ విభాగంలో సానియా సెమిస్ లోకి అడుగుపెట్టింది.

ఇప్పుడు అందిరిలోను ఒకటే చర్చ.. ఒక వేళ సానియా ఫైనల్ లో గెలిచి స్వర్ణపతకం సాధిస్తే.. తెలంగాణ ప్రభుత్వం మరో కోటిని బహుమతిగా ప్రకటిస్తుందా..? లేదా? కాని వస్తున్నా వార్తలను బట్టి చూస్తుంటే.. సానియా ఫైనల్ లో గెలిచి బంగారుపతాకాన్ని సాధిస్తే.. సానియాకు తప్పకుండ కోటి రూపాయలను అందజేయాలని కెసిఆర్ అనుకుంటున్నట్టు సమాచారం.

ఏది ఏమైనా కోటి కోసం కాకపోయినా.. దేశం కోసమైనా సానియా పతాకాన్ని గెలవాలని కోరుకుందాం..