14వ ఆర్ధిక సంఘంతో కెసిఆర్ భేటీ

Friday, September 19th, 2014, 11:22:10 AM IST

kcr
14వ ఆర్ధిక సంఘం సభ్యులతో ముఖ్యమంత్రి కెసిఆర్ ఈరోజు భేటీ అయ్యారు. ఈ భేటీలో తెలంగాణకుకావలసిన నిధుల గురించి ఆర్ధిక సంఘంతో చర్చిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అభివృద్దిలో వెనుకబడి పోయిందని.. తెలంగాణలో చాలా జిల్లాలు ఇప్పటికీ వెనుకబడి ఉన్నాయని… వాటి అభివృద్ది కోసం అవసరమైన నిధులను కేటాయించాలని ఆర్ధిక సంఘం సభ్యులను కోరినట్టు తెలుస్తున్నది. ఈ భేటీలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తో పాటు.. ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మరియు తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.