డోంట్ వరీ.. బూజు దులిపేశాం!

Monday, March 30th, 2015, 06:22:58 PM IST


ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పార్టీ సంక్షోభంపై వస్తున్న కథనాలపై విలేకరుల సమావేశంలో స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పార్టీలో ఎటువంటి సమస్యా లేదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అలాగే తమ పార్టీ పరిస్థితి చక్కబడిందని, ఆప్ లో తలెత్తిన సమస్యలను పరిష్కారం చేసుకోగలమని కేజ్రీవాల్ వివరించారు. ఇక చివరగా ‘డోంట్ వరీ.. అల్ ఈజ్ వెల్’ అంటూ కేజ్రీవాల్ మీడియా ముందు వ్యాఖ్యానించారు.

కాగా ఇటీవల కాలంలో ఆప్ పార్టీ తీవ్ర సంక్షోభానికి గురైన సంగతి తెలిసిందే. ఇక కార్యవర్గంలో అసమ్మతి జ్వాలలు చెలరేగడంతో ఆ పార్టీ నేతలు ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ లను తొలగిస్తూ ఆప్ నిర్ణయం తీసుకుంది. ఇక ఇదే నేపధ్యంగా అంతర్గత లోక్ పాల్ పదవి నుండి కూడా నేవీ మాజీ చీఫ్ ఎల్ రామ్ దాస్ ను పార్టీ కార్యవర్గం సాగనంపింది. కాగా ఈ మేరకు ఏర్పడిన సమస్యలపై కేజ్రీవాల్ పై విధంగా స్పందించారు.