కేజ్రీవాల్ మళ్ళీ ఆ పని చేయడంట!

Monday, December 8th, 2014, 03:44:06 PM IST


గతంలో తనకు రాజకీయ అనుభవం లేకనే తాను ఢిల్లీలో అధికారం చేపట్టిన 49రోజులకే రాజీనామా చేశానని… ఇక తను అటువంటి తప్పు మరలా చేయబోనని అంటున్నారు ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.ఈ రోజు ఆయన అమెరికాలోని న్యూయార్క్ లో ఆప్ పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. గతంలో తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయిన మాట వాస్తవమే అని… అది కేవలం రాజకీయ అనుభవలోపం కారణంగానే జరిగిందని… ఇకపై ఇటువంటి తప్పులు పునరావృతం కావని కేజ్రీవాల్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. ఇక ఆప్ పార్టీనుంచి వలసలు పెరుగుతున్నాయి అన్నది బూటకమని.. ఆప్ పార్టీనుంచి వలసలు ఎప్పటికీ జరగవని కేజ్రీవాల్ తెలియజేశారు.
రాబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీ తిరిగి గెలవడం ఖాయమని తెలిపారు. ఇక తాము ఢిల్లీలో అధికారంలోకి వస్తే… గతంలో చేసిన తప్పును ఎన్నటికీ చేయమని… అభివృద్దే నినాదంగా ముందుకు సాగుతామని ఆయన తెలియజేశారు.