కేజ్రీకి గట్టిగా మొట్టికాయలు!

Thursday, May 14th, 2015, 01:51:25 PM IST


ఆప్ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తమ పార్టీని నాశనం చేసేందుకు మీడియా కంకణం కట్టుకుందని, మీడియా అమ్ముడుపోయిందని విపరీత వ్యాఖ్యలు చేస్తూ మీడియాపై చర్యలకు దిగిన సంగతి తెలిసిందే. అయితే మీడియాపై క్రిమినల్, పరువునష్టం చర్యలు చేపట్టాలన్న అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయాన్ని గురువారం సుప్రీంకోర్టు తప్పుపట్టింది. అలాగే సీఎం పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా ఉన్న మీడియా కధనలపై కేసులు రిజిస్టర్ చెయ్యమని అన్ని శాఖల అధికారులు సూచించినప్పటికీ చర్యలకు సిద్ధమైన కేజ్రీవాల్ కు అత్యున్నత న్యాయస్థానం మొట్టికాయలు వేసింది.

కాగా మీడియాపై తన వ్యక్తిగత పరువునష్టం దావా అంశంతో చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కోరడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. అలాగే మీడియాపై ఆప్ జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టేను విధించింది.