రివ్యూ రాజా తీన్‌మార్ : కిట్టు ఉన్నాడు జాగ్రత్త – పృథ్వి మరోసారి పేల్చాడు !

Friday, March 3rd, 2017, 04:03:50 PM IST


తెరపై కనిపించిన వారు : రాజ్‌త‌రుణ్‌, అను ఇమ్మాన్యుయ‌ల్‌

కెప్టెన్ ఆఫ్ ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ : వంశీ కృష్ణ

మూలకథ :

కార్ మెకానిక్ అయిన కుర్రాడు కిట్టు (రాజ్ తరుణ్) జానకి (అను ఇమ్మాన్యుయేల్) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఇంతలోనే అతని ప్రేమకు అనుకోని కష్టం ఎదురై కుక్కల్ని కిడ్నాప్ చేస్తుంటాడు. ఆ విషయం తెలిసిన జానకి అతనికి దూరమైపోతుంది. అంతలోనే జానకిని క్రిమినల్(అర్బాజ్ ఖాన్) కిడ్నాప్ చేస్తాడు.

దాంతో కిట్టు జానకిని కాపాడే ప్రయత్నం మొదలుపెడతాడు. మరోవైపు పోలీసులు కూడా కిట్టువెంట పడుతుంటారు గ్యారేజ్ నడుపుకునే కిట్టు ఎందుకు కుక్కల్ని కిడ్నాప్ చేస్తాడు ? అసలు జానకి ఎవరు ? ఆమెని విలన్ ఎందుకు కిడ్నాప్ చేస్తాడు ? పోలీసులు కిట్టు వెంట ఎందుకు పడుతుంటారు ? చివరికి కిట్టు తన ప్రేమను ఎలా గెలిపించుకుంటాడు ? అనేదే కిట్టుగాడి కథ..

విజిల్ పోడు :

–> సినిమా ఆఖరి అరగంట కమెడియన్ పృథ్వి భీభత్సం చేసి వదిలిపెట్టాడు. స్పూఫ్ కామెడీ కాకుండా ఫ్రెష్ గా రేచీకటి ఉన్న రౌడీగా అతని పెర్ఫార్మెన్స్ సూపర్ కామెడీని పండించింది. దీంతో సినిమా అయిపోయిన తర్వాత ప్రేక్షకులు హాయిగా నవ్వుకుంటూ బయటకొస్తారు.

–> ఇక ఫస్టాఫ్, సెకాండాఫ్లలో దర్శకుడు నడిపిన కథనం ఫన్ తో అలా అలా సాగిపోతూ మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తికరంగా చాలా బాగుంది. కనుక దీనికి రెండో విజిల్ వేసుకోవచ్చు.

–> హీరో కుక్కల్ని కిడ్నాప్ చేయడం అనే పాయింట్ చాలా జోక్ గా అనిపించినా దర్శకుడు వంశీ కృష్ణ మాత్రం చాలా కన్విన్సింగా ఆ పాయింట్ ను స్క్రీన్ మీద ఎలివేట్ చేశాడు. కనుక అతనికి మూడో విజిల్ వేసుకోవచ్చు.

ఢమ్మాల్ – డుమ్మీల్ :
–> సినిమా ఫస్టాఫ్ పరవాలేదనిపించేలా సాగుతున్నా మధ్యలో అడ్డు తగులుతున్నట్టు వచ్చే ప్రభాకర్ గ్యాంగ్ కామెడీ కథనాన్ని కాస్త నెమ్మదింపజేసింది.

–> హీరో హీరోయిన్ల మధ్య నడిచే లవ్ ట్రాక్, రఘు బాబు – వెన్నెల కిషోర్ల కామెడీ ట్రాక్ అక్కడక్కడా కథాన్ని దెబ్బ తీశాయి.

–> ఇక సెకండాఫ్ లో నడిచే ఫన్ డ్రామా కాస్త ఎక్కువవడంతో అసలు కథ కాస్త ట్రాక్ తప్పుతున్నట్టు అనిపించింది.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..!

–> ముందు నుండి పవర్ ఫుల్ గా, తెలువిగా చూపించబడిన ఒక పోలీస్ ఆఫీసర్ తనను కిడ్నాపర్లు కన్ఫ్యూజ్ చేస్తున్నా తెలుసుకోలేకపోవడం కాస్త విచిత్రంగానే ఉంటుంది.

చివరగా సినిమా చూస్తున్న ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు..

మిస్టర్ ఏ : సినిమాలో భలే కామెడీ ఉంది కదరా !
మిస్టర్ బి : అవును.
మిస్టర్ ఏ : సినిమా పర్వాలేదనిపించింది.. పృథ్వి కామెడీతో ఇరగదీశాడు.
మిస్టర్ బి : నిజమే.. పృథ్వి మరోసారి పేల్చాడు.