బాలచందర్ కు కోలీవుడ్ ఘన నివాళి!

Wednesday, December 24th, 2014, 09:33:07 AM IST


ప్రముఖ సినీ దర్శకుడు బాలచందర్ మంగళవారం సాయంత్రం తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా బాలచందర్ మృతికి సంతాపంగా నేడు తమిళ చిత్రసీమ (కోలీవుడ్) పూర్తిగా తమ కార్యకలాపాలను రద్దు చేసుకుంది. ఈ మేరకు తమిళనాడులో ఎటువంటి సినిమా షూటింగులు కాని, అలాగే వాటికి సంబంధించిన ఇతర కార్యకలాపాలు గాని జరగబోవని కోలీవుడ్ ప్రకటించింది. ఇక బాలచందర్ భౌతికదేహానికి రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుమారుడు ప్రసన్న తెలిపారు. అలాగే అభిమానుల సందర్శనార్ధం నేడు బాలచందర్ మృతదేహాన్ని ఇంటి ఆవరణలోనే ఉంచుతామని ఆయన పేర్కొన్నారు.