కెసిఆర్ పై అలిగిన కెటిఆర్ ?

Tuesday, December 16th, 2014, 04:02:36 PM IST


ఈ రోజు తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ జరిగిన విషయం తెలిసిందే. ఈ విస్తరణలో తెలుగుదేశం పార్టీనుంచి టిఆర్ఎస్ లో చేరిన తలసాని, తుమ్మల కు మంత్రి పదవులు దక్కడమే కాకుండా… చివర్లో ఇంద్రకిరణ్ కు కూడా మంత్రి పదవులు ఇవ్వడంతో తెలంగాణ ఐటి మరియు పంచాయితీ రాజ్ శాఖా మంత్రి కెటిఆర్ అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తున్నది. విస్తరణలో భాగంగా ఎక్కువగా పదవులను వేరే పార్టీలోనుంచి టిఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన వారికి ఇవ్వడంతో కెటిఆర్ అలిగినట్టు తెలుస్తున్నది. ఈ కారణంగానే ఆయన ఈ రోజు కొత్త మంత్రుల ప్రమాణస్వీకారానికి హాజరు కాలేదని తెలుస్తున్నది. అంతేకాకుండా… తెలంగాణ ఉద్యమసమయంలో ఉద్యమంలో పాల్గొన్న కొప్పుల ఈశ్వర్ ను మంత్రి పదవి ఇవ్వకుండా పక్కన పెట్టడం కూడా కెటిఆర్ కు నచ్చలేదు. తెలంగాణ మంత్రివర్గంలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం కూడా ఆయన అసంతృప్తికి కారణం అని తెలుస్తున్నది.