బైక్ చెడిందని ఫ్రెండ్ కి ఫోన్…..హెల్ప్ చేయడానికి వచ్చి …?

Monday, August 20th, 2018, 12:35:20 PM IST

నేటి కాలంలో అమ్మాయిలపై లైంగిక దాడులు, మరియు అఘాయిత్యాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మన చట్టాలు ఎన్ని రకాలుగా కఠిన శిక్షలు అమలు చేస్తున్నప్పటికీ కూడా ఇటువంటి దుర్ఘటనలు రోజు దేశంలో ఎక్కడో ఒక చోట జరుగుతూనే వున్నాయి. ఇక విషయంలోకి వెళితే, జార్ఖండ్ లోని హిర్హీ హర్ర అనే ప్రాంతానికి చెందిన ఇద్దరు యువతులు తమ గ్రామం నుండి పొరుగూరికి ఇంటిపక్కనే వుండే ఒక యువకుడితో కలిసి బైక్ పై వెళ్లారు. కాగా తమ పని ముగించుకుని వెనక్కి వస్తుండగా, మార్గ మద్యంలో బైక్ చెడిపోవడంతో వారిలో ఒక యువతీ తన స్నేహితుడికి ఫోన్ చేసి విషయం చెప్పి, సాయం చేయడానికి రమ్మని కోరింది. అయితే ఆ యువకుడు కుట్రతో తాను రాకుండా తన స్నేహితులు 11 మందిని పంపాడు.

బైక్ ఆగిన ప్రదేశానికి చేరుకున్న 11 మంది యువకులు, ఆ యువతులతోపాటు వున్న వ్యక్తిని కొట్టి పంపించివేసి ఆపై అత్యంత విచక్షణారహితంగా ఆ ఇద్దరు యువతులపై ఒకరి తరువాత మరొకరు అత్యాచారం జరిపారు. అంతేకాక వారిని కొట్టి వారి వద్ద వున్న సెల్ ఫోన్ లు కూడా లాక్కుని, ఈ ఘటన విషయం ఎక్కడైనా చెపితే మిమ్మల్ని చంపేస్తాం అంటూ బెదిరించారు. కాగా ఘటన అనంతరం ఊరికి చేరుకున్న యువతులు జరిగిన విషయాన్నీ తమ ఇంట్లో వారికీ చెప్పగా, వారు వెంటనే పోలీస్ లను ఆశ్రయించి ఆ 11 యువకులపై ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటన సమయంలో ఫోన్ రిసీవ్ చేసుకున్న యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, త్వరలోనే ఆ 11 మంది నిందితులను పట్టుకుంటామని అంటున్నారు…..