లాలు బలవంతం చేశాడట..!

Monday, November 23rd, 2015, 06:00:13 PM IST


మొన్న బీహార్ లో ప్రమాణస్వీకారం రోజున అనుకోకుండా ఓ సంఘటన జరిగింది. ఆ సంఘటనతో కేజ్రీవాల్ అనుచర వర్గంతో పాటు ఆప్ నేతలు కూడా ఆశ్చర్యపోయారు. నితీష్ ప్రమాణస్వీకారం సమయంలో వేదిక మీద కూర్చున్న లాలు.. కేజ్రీవాల్ ను ఆలింగనం చేసుకున్నాడు. ఇది ఆ ఫోటో సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్నది.

అవినీతితో నిండిపోయిన లాలు.. కేజ్రీవాల్ ను ఆలింగనం చేసుకోవడంతో.. ఆ మరక కేజ్రీవాల్ కు కూడా అంటుకున్నదని బిజేపి నేతలు విమర్సిస్తున్నారు. అయితే, దీనికి కేజ్రీవాల్ వివరణ ఇచ్చారు. తాను కావాలని లాలుని ఆలింగనం చేసుకోలేదని.. లాలు బలవంతంగా తనను ఆలింగనం చేసుకున్నారని అన్నారు. లాలు పార్టీతో ఆప్ చేతులు కలుపుతుందని వస్తున్నా వార్తల్లో నిజం లేదని అన్నారు.