అమెరికా గుడ్ న్యూస్ చెప్పిందోచ్.. 15 వేల అదనపు వీసాలు!

Tuesday, May 29th, 2018, 12:45:51 PM IST

ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ చదువుకోవడానికి ఉద్యోగం చేయడానికి మా దేశానికి రండి అని పరదేశీయులకు ఆహ్వానాలు ఇస్తుంటే అగ్ర రాజ్యమైన అమెరికా మాత్రం అందుకు విరుద్ధంగా వీసాల విషయాలను కఠినతరం చేసిన సంగతి తెలిసిందే. అయితే కలలో కూడా ఊహించని ఓ మంచి శుభవార్తను అమెరికా రీసెంట్ గా చెప్పింది. 2018 ఆర్థిక సంవత్సరంలో 15 వేల హెచ్‌-2బీ వీసాలను అదనంగా ఇస్తున్నట్లు చెప్పింది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు పొందవచ్చు అని డిపార్ట్‌ మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ ల్యాండ్‌ సెక్యూరిటీస్ తెలియజేవింది.

అయితే ఈ వీసాలను వ్యవసాయేతర కార్మికులకు ప్రత్యేకమని తెలుస్తోంది. నాన్‌-అగ్రికల్చర్‌ కార్మికుల కొరత ఎక్కువగా ఉండడంతో వాటిని పూరించాలని అమెరికా ప్రభుత్వం ఈ అదనపు వీసాల జారీ ప్రక్రియను మొదలు పెట్టింది. 2018 లో మొదట 66 వేల వీసాలను మాత్రమే అమెరికా జారీ చేయడానికి సిద్ధమైంది. మొదటి ఆరు నెలలు 33 వేల వీసాలు. మరో ఆరు నెలలకు గాను 33 వేల వీసాలను అమలు చేయాలి. అయితే ఈ సారి వాటికంటే అదనంగా నాన్‌-అగ్రికల్చర్‌ కార్మికుల కోసమని మరో 15 వేల హెచ్-2బీ వీసాలను జారీ చేస్తున్నట్లు హోమ్‌ ల్యాండ్‌ సెక్యురిటీ కార్యదర్శి నీల్సన్ మీడియాకు వెల్లడించారు.