బ్రతకాలని లేదు ..ఫోన్ చేసిన దాచేపల్లి నిందితుడు

Friday, May 4th, 2018, 11:27:57 AM IST

చిన్నారి బాలికలపై అత్యాచారాలు పెరుగుతుండడం దేశంలో సంచలనంగా మారింది. అసిఫా కేసు నుంచి ఇప్పటివరకు మరి కొన్ని ఘటనలు మళ్లీ జరగడం అందరిని షాక్ కి గురి చేస్తోంది. రీసెంట్ గా గుంటూరు జిల్లా దాచేపల్లి ఘటన కూడా ఒక్కసారిగా దేశం నలువైపులా అందరిని కదిలించింది. నింధితులను బహిరంగంగా శిక్షించడమొక్కటే పరిష్కారమని చెబుతున్నారు. అయితే దాచేపల్లి చిన్నారిపై అత్యచారం చేసిన వృద్ధుడు సుబ్బయ్య ఘటన తరువాత కనిపించలేదు.

అయితే అతని కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే రీసెంట్ గా సుబ్బయ్య బందువులకు ఫోన్ చేసి తాను చనిపోతున్నట్లు చెప్పాడు. బుధవారం రాత్రి కుటుంబ సబ్యులకు ఫోన్ చేయడంతో ఇంతటి దారుణమైన పని ఎలా చేశావు అని అడగడంతో తనకు బ్రతకాలని లేదని ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సిగ్నల్ ద్వారా కనుగొనగా చివరగా కృష్ణానది తీర గ్రామమైన తంగెడ సెల్ టవర్ నుంచి సిగ్నల్ వచ్చినట్లు గ్రహించారు. అయితే సమీపంలో ఉన్న నదిలో దూకి ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని పోలీసులు పడవలతో గాలిస్తున్నారు.