లెజెండ్ మనసులోని మాటలు టీడీపీ.. జానాలు మా ఆస్తి, మా కబ్జా అనుకోవడం సిగ్గిమాలిన పని.. అంటున్న జేపీ మనసులోని మాటలు

Wednesday, May 25th, 2016, 02:55:37 AM IST


అపర మేధావి, ప్రపంచ రాజకీయాలను ప్రతి క్షణం గమనిస్తూ వాటిని దేశ రాజకీయాలకు అన్వయిస్తూ సమూల రాజకీయ మార్పు కోసం తపించే అతి కొద్ది మంది వ్యక్తుల్లో లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ ఒకరు. ఐఏఎస్ చదివి కలెక్టరుగా భాద్యతలు చేపట్టి ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా, శక్తి వంచన లేకుండా పనిచేసిన జేడీ సామాజిక ఉద్యామాలతో రాష్ట్రాన్ని మారుద్దామన్న ఆశతో లోక్ సత్తా పార్టీ పెట్టి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగి, ఎంతకీ మారని ఈ రాజకీయ ధోరణిని చూసి చివరికి ఇకపై ఎన్నికల్లో పోటీ చేయడం కూడా వృధా అని భావించి ప్రజల్లో చైతన్యం తేవడం కొరకు మరో మార్గాన్ని అన్వేషిస్తున్న ఉన్న ఆయన మనసులోని మాటలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

* ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు ప్రజల సమస్యలకు పరిష్కారం కావాలి. కానీ మన వ్యవస్థలో మాత్రం ఎన్నికలే పెద్ద సమస్యగా తయారయ్యాయి. అందుకే ఆ ఎన్నికలనే కొంతకాలం పక్కన పెట్టాను అంటూ తన నిర్ణయం వెనుక ఉన్న కారణాన్ని తెలిపారు.

* డబ్బు లిచ్చే వాళ్ళకి, కులం, మతం చూపే వాళ్లకి, తాయిలాలు ఇచ్చే వాళ్ళకే వేస్తామంటే నేను అసలు రాజీపడను. అం ఆద్మీ అలా రాజీ పడిన పార్టీయే అని తనకు ఆప్ కు ఉన్న వ్యత్యాసాన్నిచూపారు.

* అసలు పనులేమీ చేయకుండా, విజయాలతో పని లేకుండా కేవలం ఆర్బాటాలతోనే విజయం అనుకుంటే అదే దేశానికి పెద్ద పరాజయం అంటూ ఎవరైనా సరే హడావుడి మాని పనిచేయాలని సూచించారు.

* కేవలం రాజకీయ పార్టీగా జనాల ముందుకు వెళ్లి ఓట్లు తెచ్చుకోవడం ఉద్యమమంటే అది అవివేకమే. ఓట్లు ప్రజల్లో చైతన్యం తేవడానికి ఒక మార్గం మాత్రమే. ఆ మార్గం అసఫాలం కానప్పుడు మరో మార్గం వెతుక్కుంటాం తప్ప ప్రయత్నాన్ని మాత్రం విరమించం అంటూ తన రాజకీయ వ్యూహాన్ని బయటపెట్టారు.

* అసలు రాజకీయ పార్టీ ఎలా ఉండాలి, వాటి భాద్యతేమిటి, ఉన్న కొద్ది డబ్బు, ప్రజలిచ్చిన దికారంతో రాజ్యాంగబద్దంగా ఎలాంటి పనులు చేయాలి అనే నిర్థిష్టత లోక్ సత్తా పార్టీకే ఎక్కువగా ఉంది అని పార్టీ నిర్థిష్టతను గుర్తుచేశారు.

* జనాలు ముందుకొచ్చి పార్టీ పగ్గాలు పట్టుకుంటే పార్టీ ఎదుగుతుంది. అంతేగాని కోట్లు ఖర్చు పెట్టే నాయకులు, వాళ్ళ పిల్లల్ని భుజాల మీదికి ఎత్తుకుంటే అది ఎదుగుదల కాదు అని సామాన్య పౌరుడి సామాజిక భాద్యతను గుర్తు చేశారు.

* సమాజంలో రాజకీయ శూన్యత రావాలి, పత్రికలు కూడా వ్యవస్థ మార్పులో మాకూ భాద్యత ఉందని గుర్తించాలి. కులం, మతం ఆధారంగా జనాలకు ఆలోచించే శక్తి రావాలి అప్పుడే వేగవంతమైన మార్పు సాధ్యం అని వ్యవస్థలో రావాల్సిన మార్పును స్పష్టంగా తెలియజెప్పారు.

* చట్టబద్దమైన పాలన, అధికార వికేంద్రీకరణ, విద్యా ఆరోగ్యం అందరికీ రావాలి, రాష్ట్ర్రాల్లో ప్రత్యక్ష ఎన్నికలు రావాల్సిన అవసరముంది. అలా జరిగితే పరిపాలనలో బాగు కనిపిస్తుందని అన్నారు.

* టీడీపీ ఈ జాతి మొత్తం మా కబ్జా, ఇది మా సొంత ఆస్తి అనుకుంటున్నారు. దేశాన్ని మార్చడానికి వచ్చిన ఎవరైనా ఒక్క ఓటు తీసుకుంటే మా ఆస్తి దోచుకుంటున్నారు అన్న భావం సిగ్గి మాలిన భావన అని టీడీపీ తమ పార్టీ మీద చేసిన ఆరోపణను తిప్పికొట్టారు.

* సమాజంలో పిల్లలు ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా, డబ్బున్నా లేకున్నా, గ్రామమైనా పట్టణమైనా,తల్లిదండ్రులు ఎవరైనా సరే పిల్లలకు వాళ్ళ తెలివితేటలకు తగ్గట్టు ఎదిగే అవకాశమిచ్చే సమాజం కావాలి. అదే నా ఆశ అంటూ సమాజంలో తను కోరుకునే స్పష్టమైన మార్పును చెప్పారు.