ఆ జంట జీవితంలో లాంగ్ డ్రైవ్ నింపిన విషాదం!

Wednesday, March 7th, 2018, 03:53:17 PM IST

ఈ రోజుల్లో ఏ క్షణంలో ఏమి జరుగుతుందో ఏమిచెప్పలేని పరిస్థితికి నేటి కాలం మనిషి వచ్చాడు. అదీ కాక ఇంట్లోనుండి ఒకసారి బయటకు వెళ్లిన వాళ్ళు, మళ్లి తిరిగి ఇంటికి వస్తారో లేదో చెప్పలేము, ఒకవేళ తిరిగివస్తే ఎటువంటి పరిస్థితుల్లో వస్తారో కూడా చెప్పడం కష్టం. అటువంటి పరిస్థితి ప్రస్తుత ప్రపంచం లో వుంది. తాజాగా జరిగిన ఇలాంటి ఒక సంఘటన ముంబై లో కలకలం రేపుతోంది. ముంబై నగర శివార్లలోని షాపూర్ కు చెందిన 26 ఏళ్ల యువకుడు ఒక చైనీస్ రెస్టారెంట్ లో చెఫ్ గా పనిచేసేవాడు. అయితే తనని ఏడాది కాలంగా ప్రేమిస్తున్న ప్రియురాలితో కలిసి సరదాగా బైక్ పై అంబర్ నాథ్ తీత్వాల రోడ్డుపై లాంగ్ డ్రైవ్ కు వెళ్లాడు.

అది కొంచెం నిర్మానుష్య ప్రదేశం కావడం పైగా రాత్రివేళ కావడంతో ప్రియుడు ఒక చోట బైక్ ఆపి కాలకృత్యాలు తీర్చుకునేందుకు పొదల్లోకి వెళ్లగా, ప్రియురాలు బైక్ వద్ద నిలబడింది. అంతలో హఠాత్తుగా అక్కడకు ఓ దొంగ వచ్చి యువతిని పట్టుకొని లాక్కెళుతుండగా ప్రియుడు పరుగున వచ్చి అతన్ని అడ్డుకునేందుకు యత్నించాడు. అంతే ఆ దొంగ తుపాకీతో అతడిని కాల్చి చంపి ప్రియురాలిని పొదల్లోకి తీసుకువెళ్లి ఆమెపై క్రూరంగా అత్యాచారం జరిపాడు. అంతటితో ఆగకుండా, వారి వద్ద ఉన్న డబ్బు, ఆభరణాలు, బైక్ తీసుకొని పారిపోయాడు. ఘటన తరువాత బాధిత యువతి దారిలో పోతున్న వారి సహాయంతో పోలీసుస్టేషనుకు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడైన దొంగను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు….