‘బేటీ బచావో.. బేటీ పడావో’ ప్రచారకర్తగా మాధురీ దీక్షిత్!

Thursday, January 22nd, 2015, 11:59:39 AM IST


కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రారంభించనున్న ‘బేటీ బచావో.. బేటీ పడావో’ కార్యక్రమానికి ప్రచార కర్తగా ప్రముఖ బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ ఎంపికయ్యారు. ఈ మేరకు మాదురి తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించి హర్షం వ్యక్తం చేశారు. కాగా నేడు భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ పధకాన్ని హర్యానాలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇక ఆడ శిశువుల నిష్పత్తిని పెంచడమే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం ఈ పధకానికి శ్రీకారం చుట్టింది. కాగా తొలిదశలో ఎంపిక చేసిన వంద జిల్లాలలో ఈ పధకం అమలుకానుంది. ఇక మహిళా శిశు సంక్షేమం, మానవ వనరుల అభివృద్ధి, ఆరోగ్య మంత్రిత్వ శాఖలు ఉమ్మడిగా ఈ పధకాన్ని నిర్వహించనున్నాయి.