భర్తకు తెలియకుండా ప్రియుడు – ఆపై మరొకరు..చివరికి..!

Thursday, September 20th, 2018, 06:13:16 PM IST

తెలంగాణ రాష్ట్రాల్లో ఒక్కసారిగా పరువు హత్యలు అందరిని షాక్ కి గురి చేసిన సంగతి తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా వరుసగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇక మరోవైపు అక్రమ సంబంధాల కారణంగా పలువురు హత్యకు గురవుతున్నారు. రీసెంట్ గా అలాంటి ఘటనే ఒకటి తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. కిరణ్ అనే మహిళ భర్తకు తెలియికుండా ప్రియుడిని కలుస్తోంది. అయితే అదే ప్రియుడు ఆగ్రహానికి ఆమె చావు భయాన్ని చూడాల్సి వచ్చింది. అక్రమ సంబంధం కారణంగా మరో వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డాడు.

వివరాల్లోకి వెళితే స్థానికులు చెప్పిన కథనం ప్రకారం.. బాపన్న దొర అనే ఒక వ్యక్తి కొన్నేళ్ల క్రితం పని కోసం మహారాష్ట్ర వెళ్లాడు. అయితే అక్కడ అతనికి కిరణ్ అనే అమ్మాయి పరిచయం కావడంతో ఆమెను వివాహం చేసుకొని గ్రామానికి తీసుకువచ్చాడు. అయితే కిరణ్ భర్తకు తెలియకుండా గత కొంత కాలంగా స్థానికంగా ఉండే పాతాళ నాగుల అనే వ్యక్తితో శారీరక సంబందాన్ని సాగిస్తోంది. ఇక సురేష్ అనే మరో యువకుడితో కూడా కిరణ్ సన్నిహితంగా ఉండడం పాతాళ నాగుల కంట పడింది. తీవ్ర ఆగ్రహానికి లోనైనా ఆ వ్యక్తి సురేష్, కిరణ్ లపై కత్తితో దాడి చేశాడు. గమనించిన స్థానికులు వెంటనే వారిని హాస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారాన్ని ఇచ్చారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.