ఏకె ఎంటర్టైన్మెంట్ లో మహేష్ సినిమా..?

Friday, February 26th, 2016, 02:43:42 PM IST


శ్రీమంతుడు విజయం తరువాత మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమా చేస్తున్నారు. ఈ సినిమా నిర్మాణం శెరవేగంగా జరుపుకుంటున్నది. ఏప్రిల్ 29న సినిమా విడుదల అవుతుంది. ఇక దీనితరువాత మహేష్ బాబు మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. దీనిని పక్కన పెడితే.. మహేష్ కు 14 రీల్స్ పతాకంతో ప్రత్యేక అనుబంధం ఉన్నది. 14 రీల్స్ పతాకం ఇప్పటి వరకు 7 చిత్రాలు నిర్మించింది. ఇందులో మహేష్ బాబుతో మూడు చిత్రాలను నిర్మించింది. ఇందులో దూకుడు సూపర్ హిట్ కాగా, వన్ నేనొక్కడినే ఫర్వాలేదనిపించింది. ఇకపోతే, 14 రీల్స్ పతాకంలో నిర్మాతలలో ఒకరైన అనీల్ సుంకరకు చెందిన ఏకే ఎంటర్తైన్మెంట్స్ లో మహేష్ బాబు సినిమా చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మహేష్ బాబు అనీల్ సుంకరకు డేట్స్ ఇచ్చారని సమాచారం. ఏకే ఎంటర్తైన్మెంట్ బ్యానర్ లో వచ్చే సినిమాకు దర్శకుడు ఎవరు అన్నది ఇప్పటివరకు సస్పెన్స్ గానే ఉన్నది. అనీల్ సుంకర బ్యానర్లో సినిమా అయితే ఖచ్చితంగా ఉంటుందని మాత్రం తెలుస్తున్నది. ఈ సినిమాకు సంబంధించిన అన్ని విషయాలు త్వరలోనే బయటకు వస్తాయని తెలుస్తున్నది.