సిద్దాపూర్ లో నమ్రత సందడి… మే 8న బుర్రిపాలెం కు మహేష్..!

Friday, April 29th, 2016, 03:09:05 PM IST


టాలీవుడ్ సినీనటుడు మహేష్ బాబు తెలంగాణలోని మెహబూబ్ నగర్ జిల్లాలోని సిద్దాపూర్ అనే గ్రామాన్ని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా, అటు ఆంధ్రప్రదేశ్ లోని బుర్రిపాలెం అనే గ్రామాన్ని కూడా మహేష్ దత్తత తీసుకున్నారు. ఇక ఇందులో భాగంగా ఈరోజు మహేష్ సతీమణి నమ్రతా శిరోద్కర్ సిద్దాపూర్ గ్రామంలో పర్యటించారు. గ్రామంలో సమస్యల గురించి, అభివృద్ధి చేయవలసిన విషయాల గురించి మహేష్ సతీమణి అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మహేష్ బాబు మంత్రి కేటిఆర్ తో కలిసి త్వరలోనే సిద్దాపూర్ వస్తారని చెప్పారు. ఇక ఇదిలా ఉంటె, మహేష్ బాబు మే 8 వ తేదీన తన సొంతగ్రామం బుర్రిపాలెం వెల్లనున్నారు. నెలరోజుల క్రితమే వెళ్ళవలసి ఉన్నా.. కొన్ని కారణాల వలన వెళ్ళలేకపోయారు.